సరికొత్తగా వస్తున్న స్మర్ఫ్స్.

Posted 10 months ago | Category : world kids

స్మర్ఫ్స్ స్మర్ఫ్స్ స్మర్ఫ్స్ ఈ రోజుల్లో ఈ పేరు తెలియని పిల్లలు ఉండరు.లిల్లీపుట్లు తెలుసుగా అలాంటి బుల్లి రూపాలతో ఆకట్టుకునే ఈ పాత్రలను స్మర్ఫ్స్ అంటారు.ఇవి కార్టూన్ పుస్తకాలలో,వీడియో గేములలో, సినిమాలలో ప్రపంచ వ్యాప్తంగా తెగ సందడి చేస్తున్నాయి.జోకర్ల టోపీలు పెట్టుకునే ఈ నీలి రంగు బుడతలు ఇప్పడు మరిన్ని హంగులతో కొత్త కథాంశంతో మళ్ళీ పిల్లల ముందుకి రాబోతున్నాయి.ఎలా అనుకుంటున్నారా అదేనండి 'స్మర్ఫ్స్ ది లాస్ట్ విలేజ్' అనే సినిమాలో. ఈ సినిమాను త్రీడి యానిమేషన్ పద్దతిలో తీశారు ఇందులో స్మర్ఫ్స్ ఎన్నో సాహసాలు చేస్తారు.

అదిరిపోయే సన్నివేశాలు,కళ్ళు చెదిరే గ్రాఫిక్స్,ఆకట్టుకునే యానిమేషన్లతో ఈ సినిమాను చిత్రీకరించారు.గతంలో విడుదలైన స్మర్ఫ్స్ సినిమాలకు భిన్నంగా,సరికొత్తగా ఉంటుంది ఈ సినిమా. ఇక కథ విషయానికి వస్తే ఇందులో స్మర్ఫ్స్ ఒక కనుమరుగైన గ్రామం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాడు,ఈ ప్రయత్నంలో స్మర్పేట్ అనే అమ్మాయికి ఒక రహస్య పటం దొరుకుతుంది.దాని ఆధారంగా స్మర్ఫ్స్ తన స్నేహితులైన బ్రెయినీ,క్లెమ్సి,హెప్టిలతో కలిసి ఓ నిషిద్ధ అడవిలో ప్రయాణం సాగిస్తూ ఆ ఊరి ఆచూకీని కనుక్కోవడానికి శ్రమిస్తారు.మరో వైపు గర్గమెల్ అనే దుష్ట మాంత్రికుడు కూడా ఆ ఊరిని చేరుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు.స్మర్ఫ్స్ ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి ఈ మాంత్రికుడు వారిపై దాడి చేస్తుంటాడు.తన మాంత్రిక శక్తులతో రకరకాల ఇబ్బందులకు గురిచేస్తుంటాడు.కానీ ఈ ప్రమాదాల్ని దాటుకుంటూ ఆ నీలి రంగు బుడతలు బోలెడు సాహసాలు చేసుకుంటూ పోతుంటారు.అయితే మాంత్రికుడి కన్నా ముందే ఆ ఊరిని స్మర్ఫ్స్ కనిపెట్టారా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఈ చిత్రాన్ని సోని పిక్చర్స్ యానిమేషన్ వాళ్ళు తెరకెక్కించారు.స్మర్ఫ్స్ కామిక్ పుస్తకాల ఆదారంగా ఈ చిత్రాన్ని చిత్రి కరించారు.

ఈ నీలి రంగు బుడతలు కార్టూన్ పాత్రలుగా పుట్టింది 1958లో బెల్జియంకు చెందిన కార్టూనిస్టు పేయో వీటిని గీశాడు.అప్పటి పత్రికల్లో వీరి కామిక్ లు ప్రచురితమయ్యేవి.తర్వాత టీవీల్లో,యానిమేషన్ సినిమాల రూపంలో వస్తున్నాయి.అసలు వీటికి స్మర్ఫ్స్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ? దీని సృష్టికర్త పేయో ఓసారి భోజనం చేస్తూ సాల్ట్ అనే పదం గుర్తు రాక స్మార్ప్ అన్నాడట.అనుకోకుండా కని పెట్టిన ఈ పదాన్ని కార్టూన్ పాత్రకు పెట్టేశాడు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!