వైసీపీఫై బాబు నెక్స్ట్ ప్లాన్ ఇదే...!

Posted 5 months ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశంపార్టీ ప్రతిపక్ష పార్టీ అయినా వైసీపీకి షాక్ లు ఇస్తూనే ఉంది. ప్రమాణస్వీకారానికి ముందే కొంతమంది ఎంపీలు జగన్ కు హ్యాండ్ ఇచ్చి పలువురు ఎమ్మెల్యేలు సైకిలెక్కేశారు. ఇప్పటికి పార్టీ ఫిరాయింపుకి మరికొంత మంది రెడీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2018 అంటే వచ్చే ఏడాది మార్చిలో 3 రాజ్యసభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. విభజన తర్వాత లాటరీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి, టి.దేవేందర్ గౌడ్ ల పదవీకాలం వచ్చే ఏడాదితో ముగియనుంది. వీరి స్థానంలో మరో ముగ్గురిని రాజ్యసభకు పంపేందుకు అవకాశం ఉంది. ఈ మూడు సీట్లను కైవసం చేసుకునేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తోంది.

ఒక్కో ఎంపీని ఎంచుకునేందుకు కనీసం 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీ చేతిలో 46 మంది ఎమ్మెల్యేలున్నారు. గత రాజ్యసభ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరపున ఎన్నికయ్యారు. అయితే ఈసారి మాత్రం వైసీపీ నుంచి ఒక్కరిని కూడా ఎన్నిక కాకుండా చూడాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇందుకో ఆరుగురు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఆరుగురిని చేర్చుకుంటే వైసీపీకి 40 మంది మాత్రమే మిగులుతారు. అప్పుడు వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం ఉండదు అని బాబు ప్లాన్.

వాస్తవానికి సుమారు 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ శ్రేణులు చెబ్తున్నాయి. అయితే అందరినీ కాకుండా సెలక్టివ్ గా కేవలం ఆరుగురిని మాత్రమే చేర్చుకోవాలని బాబు భావిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో కనీసం ఒక స్థానాన్ని దక్కించుకున్న వైసీపీకి ఈ సారి ఆ సీటు కూడా లేకుండా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే నంద్యాల, కాకినాడల్లో ఓడిపోయిన వైసీపీకి త్వరలో మరో షాక్ తగలనున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!