అమెరికాలో భారీ దొంగతనం.

Posted 9 months ago | Category : world

కుడి చేతికి కూడా తెలియకుండా ఎడమచేత్తో దొంగతనాలు చేస్తూ చోరకళకు గుర్తింపుతెచ్చేవారు కొందరైతే, కళను అపహాస్యం చేస్తూ వార్తల్లో నిలిచేవాళ్లు మరికొందరు! అలాంటిదే ఇప్పుడు అమెరికాలో జరిగింది.. అమెరికాలోని తమ గోడౌన్ నుండి కండోమ్స్ భారీ ఎత్తున దొంగతనానికి గురి కావడం గురించి చమత్కారంగా వివరించింది లెలో అనే స్వీడిష్ సెక్స్ టాయ్స్, కండోమ్స్ తయారీ సంస్థ. లాస్ వెగాస్ ప్రాంతంలోని తమ గోడౌన్ లో దొంగతనం జరిగిందని ఆ సంస్థ ఫేస్ బుక్ లో ప్రకటించింది. గత వారంలో వరస సెలవు దినాల నేపథ్యంలో తాము గోడౌన్ ను మూసి ఉంచామని, సెక్యూరిటీ కూడా లేకుండా పోవడంతో సోమ, మంగళవారాల్లో కొంతమంది దొంగలు షట్టర్లు తెరిచి చొరబడ్డారని లెలో తెలిపింది. ఏకంగా వాహనాన్ని తీసుకొచ్చి బండిల్స్ లోని కండోమ్స్ ను వేసుకుని వెళ్లిపోయారని వివరించింది.

ఈ ఉదంతం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దొంగలు దాదాపు ముప్పై వేల కండోమ్ ప్యాకెట్స్ ను దోచుకెళ్లారని, వాటితో పాటు భారీ ఎత్తున సెక్స్ టాయ్స్ ను కూడా ఎత్తుకెళ్లారని లెలో ప్రకటించింది.ఈ ఉదంతంపై సరదాగా స్పందిస్తూ 'వాళ్లు అన్ని కండోమ్స్ ఏం చేసుకుంటారో అర్థం కావడం లేదు, బహుశా ఈ సెక్స్ టాయ్స్ ను, కండోమ్స్ ను ఎక్కడైనా పార్టీ చేసుకోవడానికి వాడుకుంటున్నారేమో. అలాగైతే దొంగతనం చేయడానికి బదులుగా ఒక సారి అడిగి ఉండే పార్టీకి మేమే స్పాన్సర్ చేసే వాళ్లం'.. అని ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.విశేషం ఏమిటంటే అమెరికా చరిత్రలో ఇంత భారీ స్థాయిలో కండోమ్స్ దొంగతనం ఎప్పుడూ జరగలేదట. కండోమ్స్ దొంగతనాల్లో ఇదే అత్యంత భారీ అని అక్కడి పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 5 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!