ప్రతికూలతల మధ్య ప్రభుత్వం ఏర్పాటు యత్నంలో థెరెసా మే

Posted 7 months ago | Category : world politics

బ్రిటన్‌లో ఓ వైపు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు  ప్రధాని థెరెసా మే చేస్తుండగా, మరోవైపు మూడేండ్ల ముందే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి, పార్టీని మైనారిటీ లో పడవేసిన ఆమెపై పార్టీ లోపల, బయట రాజీనామా చేయమని వత్తిడులు పెరుగుతున్నాయి. మూడేండ్లు ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందని పలువురు సొంత పార్టీ సభ్యులు ఆమె పై దుమ్మెత్తిపోస్తున్నారు. 

కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది థెరెసా స్థానంలో వేరొకరిని నియమించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని థెరెసా సలహాదారులు నిక్ తిమోతీ, ఫియోనా హిల్ రాజీనామా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వీరిద్దరే థెరెసాపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు పొందలేకపోవడంతో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఇప్పుడు మద్దతు ఇవ్వడానికి డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) సుముఖత వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. ప్రభుత్వంలో చేరకుండా బయట  అవకాశం ఉంది. అందుకు షరతులు ఏమిటో తెలియటం లేదు.  పైగా, స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలు, గర్భస్రావం వంటి అంశాలను వ్యతిరేకించే డీయూపీ మద్దతుతో థెరెసా ప్రభుత్వం కొనసాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

గత ప్రభుత్వంలో పనిచేసిన కీలకమైన మంత్రులందరికీ తిరిగి అవే శాఖలను కేటాయించాలని థెరెసా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది జూనియర్ మంత్రులు ఓటమి చెందడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేసేందుకు ప్రధాని కసరత్తు చేస్తున్నారు. 


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 11 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 12 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted 13 hours ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted 14 hours ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted 17 hours ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted a day ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ