//single page style gallary page

రేవంత్‌ చేరికకు అభ్యంతరం లేదు: డికె అరుణ

Posted 10 months ago | Category : politics

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా మార్గం సుగమం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆదివారం నాడు కుంతియా హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డి పార్టీలో చేరే విషయమై పార్టీ నేతలతో చర్చించారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు.కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.అయితే తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి పార్టీలో చేరడాన్ని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కుంతియా కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్‌రెడ్డి చేరిక విషయమై నచ్చచెప్పారని సమాచారం. రేవంత్‌ చేరిక వల్ల పార్టీకి ఏ రకంగా ప్రయోజనం జరుగుతోందనే విషయమై కుంతియా పార్టీ నేతలతో చర్చించారు.

కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి డికె అరుణ ప్రకటించారు. వారం రోజుల క్రితం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డికె అరుణ ఇంటికి వెళ్ళి చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్న విషయమై ఆమెతో చెప్పారు. ఈ తరుణంలో డికె అరుణతో పాటు మరికొందరు నేతలు రేవంత్ రాకను వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి.ఈ తరుణంలో కుంతియా రంగంలోకి దిగారు. దీంతో రేవంత్‌ రాకకు తాము వ్యతిరేకం కాదని డికె అరుణ ప్రకటించారు.

కోమటిరెడ్డి సోదరులు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కొంత అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే కోమటిరెడ్డి సోదరులతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యేందుకు కూడ ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాలేదు. ఈ తరుణంలో కుంతియాతో కాంగ్రెస్ పార్టీ నేతలకు సర్ధిచెప్పారని అంటున్నారు. అయితే పీసీసీ పీఠం కన్నేసిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పటికే కొంత అసంతృప్తి గళాన్ని వినిపిస్తూ వచ్చారు. అయితే రేవంత్‌లాంటి నేతలు పార్టీలో చాలా మంది ఉన్నారని కూడ ఇటీవలే కోమటిరెడ్డి సోదరులు ప్రకటించడం గమనార్హం.

కాంగ్రెస్‌లోకి రేవంత్‌ రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా తెలిపారు. డీకే అరుణతో ఇప్పటికే మాట్లాడానని, పెద్ద వ్యతిరేకత లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో షరతులతో కూడిన చేరికలు ఉండవని కుంతియ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో రాహుల్‌ పర్యటన ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దుకు నిరసనగా నవంబర్‌ 8న బ్లాక్‌ డేకు పిలుపునిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.


రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 15 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 16 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 17 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 21 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 3 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 3 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 4 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 4 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!