కృత్రిమ చేయి తనే తయారు చేసుకున్నాడు

Posted a year ago | Category : world enterprenuership

బొలివియాకు చెందిన లియోనార్డో విస్కారాకి పుట్టుకతోనే కుడి చేయి సరిగా పనిచేయదు. దీంతో ఏ పని సరిగా చేయలేకపోయేవాడు. అతని తల్లిదండ్రులు కృత్రిమ చేయిని అమర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ బాలుడికి తగ్గ పరిమాణంలో కృత్రిమ చేయి దొరకలేదు. అయితే.. చిన్నప్పటి నుంచి లియోనార్డోకి స్వతహాగా కృత్రిమ చేయిని తయారు చేసుకోవాలన్న కోరిక ఉండేది. ఒకసారి తనదగ్గర ఉన్న బొమ్మకారు కింద పడి పగిలిపోయింది. వెంటనే ఆ ముక్కలన్నిటినీ సేకరించి కారు తయారు చేశాడు. అప్పుడే విడిభాగాలతో చేయి కూడా తయారు చేసుకోవచ్చనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా అందుబాటులో ఉన్న వస్తువులతో కృత్రిమ చేయిని రూపొందించాడు. కానీ తాను అనుకున్నట్లుగా చేయి తయారు చేయలేకపోయాడు.

కొద్ది రోజులకు పిల్లలకోసం ప్రత్యేకంగా అమెరికాలోని ఓ సంస్థ త్రీడీ ప్రింటెడ్‌ రోబోటిక్‌ చేతులను తయారు చేస్తుందన్న విషయం తెలుసుకుని బంధువుల సాయంతో కృత్రిమ చేయిని తెప్పించుకున్నాడు. కానీ లియోనార్డోకి అదీ సరిపోలేదు. దీంతో మరోసారి నిరాశ చెందాడు. ఈసారిఅమెరికా నుంచి తెప్పించిన రోబోటిక్‌ చేతిని పరిశీలించి.. దానికి సరికొత్త పరిజ్ఞానాన్ని జోడించాడు. స్థానికంగా ఉన్న రోబోటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ సాయంతో తనకు సరిపోయే త్రీడీ ప్రింటెడ్‌ రోబోటిక్‌ చేయిని రూపొందించి అనుకున్నది సాధించాడు. మార్కెట్లో దొరికే కృత్రిమ చేయి 15వేల డాలర్లు ఉంటే కేవలం వంద డాలర్లతో త్రీడీ ప్రింటెడ్‌ చేయిని తయారు చేసిన లియోనార్డో బొలివియాలో సెలబ్రిటీగా మారిపోయాడు.

ప్రస్తుతం చాలామంది కృత్రిమ చేయి తయారు చేసివ్వాలంటూ అతనికి ఆర్డర్లు ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి స్వయంగా రోబోటిక్‌ చేతిని రూపొందించి ఇచ్చాడు. భవిష్యత్‌లో టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన కృత్రిమ చేతులను తయారు చేసే ఆలోచనలో ఉన్నాడు 14ఏళ్ల లియోనార్డో


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!