ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

30 లక్షల ఉద్యోగాలు సృష్టిసంచనున్న టెలికాం

Posted 4 months ago business


2018 నాటికి టెలికాం రంగం 30 లక్షల ఉద్యోగాలు సృష్టించగలదని అసోచామ్‌-కేపీఎమ్‌జీ అధ్యయనం పేర్కొంది. నానాటికీ విస్తరిస్తున్న 4జీ సాంకేతికత, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ వాలెట్ల వాడకం పెరగడం, డేటా వినియోగం ఎక్కువడం దీనికి కారణాలని తెలిపింది. ఓపక్క టెలికామ్‌ రంగంలో పోటీ విస్తృతమైన టారిఫ్‌లు దిగజారి, ఆదాయాలు క్షీణించి, లాభదాయకత సన్నగిల్లి ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఆశావహ ఉద్యోగ అంచనాలు వెలువడటం గమనార్హం.

వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం పడిపోయి టెలికామ్‌ కంపెనీలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు మౌలిక సదుపాయాలను పెంచుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. తద్వారా పోటీని ఎదుర్కోవడానికి వీలవుతుందని అధ్యయనం వెల్లడించింది.

భవిష్యత్తు గిరాకీని తట్టుకోవాలంటే ఇప్పుడున్న మానవ వనరులు సరిపోవని, అలాగే సాంకేతిక నైపుణ్యాలున్న నిపుణలకు సైతం కొరత ఉందని పేర్కొంది. టెక్నాలజీ పెరిగిపోతుండటంతో సైబర్‌ భద్రత నిపుణులు, అప్లికేషన్ల డెవలపర్లు, మార్కెటింగ్‌ సిబ్బంది, మౌలిక సదుపాయాలు, మొబైల్‌ సాంకేతిక నిపుణులు అవసరమవుతారని తెలిపింది. ఉన్న ఉద్యోగులకు, సిబ్బందికి నూతన నైపుణ్యాలు కూడా అవసరం తెలిపింది.

5జీ, ఎమ్‌2ఎమ్‌(మిషన్‌ టు మిషన్‌) వంటి నూతన సాంకేతికతలు, సమాచార, కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ విస్తరిస్తుండటంతో 2021 నాటికి ఈ విభాగాల్లో 8,70,000 ఉద్యోగాలు పుట్టుకొస్తాయని సర్వే తెలిపింది. అలాగే డేటా వినియోగం పెరగడం, వాలెట్లు, ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానాలు, స్మార్ట్‌ఫోన్ల విస్తృతి వంటి అంశాలు వచ్చే ఏడాదికల్లా 30 లక్షల ఉద్యోగాలను సృష్టించే స్థాయికి టెలికామ్‌ రంగాన్ని తీసుకెళ్తుందని అధ్యయనం వెల్లడించింది.

మొబైల్‌ డేటా వినియోగం 2016 నాటికి 76 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం 1.1 బిలియన్‌(సుమారు 110 కోట్లు) మంది టెలికాం చందాదారులు ఉన్నారని 2020 నాటికి ఈ సంఖ్య 1.4 బిలియన్‌ (140 కోట్లు)కు చేరగలదని తెలిపింది. మొబైల్‌ వినియోగదారులు సుమారు 64.6 కోట్లు ఉండగా 2020 నాటికి మరో 30 కోట్ల మంది జత చేరవచ్చని అంచనా వేసింది.

Related Articles

Most Read