ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పొత్తు పై వెంకయ్య దాటవేత... టిడిపిలో కలవరం

Posted 7 months ago state politics

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి ప్రయోజనాలు కాపాడటంలో ఎప్పుడూ ముందుంటారు అనుకొనే కేంద్ర మంత్రి యం వెంకయ్యనాయుడు మొదటిసారిగా టిడిపి-బిజెపి ల పొత్తు గురించి దాటవేత వైఖరి ప్రదర్శించడం అధికార పక్షంలో కలవరం కలిగిస్తున్నది. 

మొదటి నుండి బీజేపీలో ఒక వర్గం టీడీపీ తో పొత్తు పట్ల విముఖంగా ఉన్నది. టిడిపి తో ఉన్నంత కాలం పార్టీ ఎదుగుదల ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. పైగా వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తరచూ పొగడ్తలతో ముంచెత్తుతూ బిజెపి ప్రయోజనాలను మంటగడుపుతున్నారని కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. 

దానితో 2019 ఎన్నికల్లో టిడిపి తో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేయాలని కొందరు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తో పొత్తు పెట్టుకోవాలని మరి కొందరు కోరుతుండగా, పవన్ కళ్యాణ్ తో దోస్తీ కోసం ఇంకొందరు ఆరాటపడుతున్నారు. ఈ వాదనలు అన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ముందు కూడా వినిపించారు. 

అమిత్ షా విజయవాడ పర్యటనకు వస్తున్న వారం రోజుల ముందుగా వెంకయ్య నాయుడు "ఇప్పుడు కలిసి (బీజేపీటీడీపీ) ఉన్నాం. కలిసే ఉంటాం. వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తాం అన్నది 2019లో తేల్చుకుంటాం. ఇప్పుడెందుకు?’’  అంటూ ప్రశ్నించడం ఆసక్తి కలిగిస్తున్నది. 

ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ ని కలసి రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి కి మద్దతు తెలపడం పట్ల స్వయంగా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి నాయకత్వాన్ని నిలదీస్తూ పలువురు మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు 2019లో పొత్తు టిడిపి తోనే కొనసాగనవసరం లేదని సంకేతాన్ని స్వయంగా వెంకయ్య నర్మగర్భంగా ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యతను సంతరింప చేసుకున్నారు. 

పైగా మోడీ-జగన్ భేటీ పట్ల టిడిపి నాయకులు చేస్తున్న రసభ పట్ల వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. "ఒక ప్రతిపక్ష నేత ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలిసి వినతిప్రతం ఇస్తే, దానిపై తర్జనభర్జనలు ఏమిటో అర్థం కావడం లేదు. ప్రతిపక్ష నేతలు ప్రధానమంత్రిని కలవడం సాధారణమే. నరేంద్ర మోదీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీపై రాజకీయ పరిపక్వత లేని వారే రకరకాలుగా మాట్లాడుతున్నారు’’ అంటూ మాట్లాడటం నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించే అని రాజకీయ వర్గాలలో వాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

Most Read