ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

బాలయ్య తీరుపై మండి పడుతున్న తెలుగు తమ్ముళ్లు.

Posted 2 months ago politics

టీడీపీ నేత, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు కలవరపడుతూ తమలోని అసంతృప్తిని బహిరంగానే వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, వీటిని ఎలా సమర్థించుకోవాలో తెలియని స్థితిలో వారు ఉన్నారు. సీఎంకు బామ్మర్ధి కావడంతో పాటు సినీ హీరో అయినందువల్ల ఇలా చేయవద్దని ఆయనకు చెప్పలేకపోతున్నామని, ఇక చంద్రబాబే బాలయ్యతో మాట్లాడాలని పార్టీ సీనియర్ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.

అనంతపురం జిల్లాలో జరిగిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న వేళ, ఓ అభిమాని, టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ కొట్టినట్టు కనిపిస్తున్న వీడియో వైరల్ అయింది. పంచ్ డైలాగులు, ఫైట్స్‌తో సినిమాల్లో తన అభిమానులను అలరించే బాలకృష్ణ, పూలదండ వేయాలని వచ్చిన వారిని, సెల్ఫీ దిగాలని భావించిన వారిని కొట్టడం మంచిది కాదని వారు హితవు పలుకుతున్నారు.

Related Articles

Most Read