//single page style gallary page

టిడిపి `మహానాడు' దృష్టి అంతా 2019 ఎన్నికలపైనే!

Posted a year ago | Category : state politics

తెలుగు దేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక సమ్మేళనం `మహానాడు' మూడు రోజుల పాటు నేడు విశాఖపట్నంలో కొద్దీ సేపట్లో ప్రారంభం కానున్నది. పదేళ్ల తరువాత విశాఖపట్నంలో జరుగుతున్న నాడులో 2019 ఎన్నికల పైననే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

30 వేలమంది పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరవుతారని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితమే బిజెపి అధ్యక్షులు అమిత్ షా విజయవాడలో కలసి టిడిపి తో తమ పొత్తు 2019 నాటికి కొనసాగుతుందని భరోసా ఇవ్వడంతో చంద్రబాబునాయుడు ఇప్పుడు ధీమాగా ఉన్నారు.

అయితే రాష్ట్రంలో మిత్రపక్షం బీజేపీ నూతన ఉత్సాహంతో ఉండటం, ప్రధాన ప్రతిపక్షం వై యస్ ఆర్ కాంగ్రెస్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను లక్ష్యంగా చేసుకొని, అవినీతి ఆరోపణలను చేస్తూ ఉండటం, పవన్ కళ్యాణ్ నూతన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయడంతో ఒక విధంగా టిడిపి పెను సవాళ్లు ఎదుర్కొంటున్నది. 

మరో వంక రాష్ట్రంలో ఈ మధ్య శాంతి భద్రతల పరిస్థితులు ఆందోళన కరంగా ఉంటున్నాయి. పోలీస్ నిఘా విభాగం రాజకీయ కార్యక్రమాలకు పరిమితం కాకుండా శాంతి భద్రతలు, ప్రభుత్వంలో అవినీతికి సంబంధించిన అంశాలపై కూడా ద్రుష్టి సారించాలని స్వయంగా ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం హితవు చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిష్టితి కూడా  సంతృప్తికరంగా లేదు. 

కేంద్ర ప్రభుత్వం రాష్త్రానికి ప్రత్యేక ఆర్ధిక సహాయాన్ని ప్రకటించినా ఆచరణకు నోచుకోవడం లేదు. కనీసం విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చడం లేదు.  అమరావతి రాజధాని నగరం నిర్మాణం గురించి ఎంతో అట్టహాసంగా ప్రచారం చేస్తున్నా ఇంకా కీలకమైన పరిపాలన భవనాల నమూనా కూడా సిద్ధం కాలేదు. ఇవన్నీ ప్రజలలో ప్రభుత్వం పట్ల అసహనాన్ని పెంచుతున్నాయి. 

పార్టీలో తొలి నుండి పనిచేస్తున్న వారు ఇతర పార్టీల నుండి ఫిరాయించి రెండుళ్లుగా చేరుతున్న వారితో సయోధ్యతో ఉండడం లేదు. పలు చోట్ల ఘర్షణలు కూడా చోటు  చేసుకొంటున్నాయి. ఇటువంటి పరిస్థితులలో పార్టీని సమైక్యంగా ఉంచి, పార్టీ కార్యకర్తలు, నాయకులకు భరోసా కలిగించడం చంద్రబాబునాయుడు ముందు నేడున్న కీలక కర్తవ్యం. 

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 6 minutes ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

మరల వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....1.5 లక్షల సాయం..

Posted 36 minutes ago | Category : state

మరల వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....1.5 లక్షల సాయం..

కేరళ ప్రజలని వణికిస్తున్న మరో భయం....!

Posted 2 hours ago | Category : state

కేరళ ప్రజలని వణికిస్తున్న  మరో భయం....!

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ....కేజీ పచ్చిమిర్చి రూ.400 ....!

Posted 2 hours ago | Category : state

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ....కేజీ  పచ్చిమిర్చి రూ.400 ....!

పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!

Posted 6 hours ago | Category : state

పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 21 hours ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 21 hours ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

Posted a day ago | Category : national state

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

Posted a day ago | Category : national state

 కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

పెద్దమనసు చాటుతున్న స్టార్ హీరోస్ ....కేరళ కి భారీగా విరాళాలు ...!

Posted a day ago | Category : state movies

పెద్దమనసు చాటుతున్న స్టార్ హీరోస్ ....కేరళ కి భారీగా విరాళాలు ...!