ప్రత్యేక హోదాపై గొంతెత్తిన టిడిపి ఎమ్మెల్యే మోదుగుల

Posted 9 months ago | Category : state politics

కాంగ్రెస్ పార్టీ గుంటూరు లో జరుపుతున్న ప్రత్యేక హోదా భరోసా సదస్సుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పర్యటన పట్ల టిడిపి కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు జరుపుతుంటే, రాహుల్ ఏ మొఖం పెట్టుకొని ఏపీకి వస్తారంటూ మంత్రులు ప్రకటనలు ఇస్తూ ఉంటే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి మాత్రం `ప్రత్యేక హోదా' అని నినదించడం టిడిపి వర్గాలకు కలవరం కలిగిస్తున్నది. 

పైగా  కాంగ్రెస్‌ సభ విజయవంతమైనా, ఏపీలో కాంగ్రెస్ బలపడినా దానికి బీజేపీ బాధ్యత వహించ వలసి ఉంటుందని  మిత్ర పక్షాన్ని హెచ్చరించడం టిడిపి వర్గాలను విస్మయ పరుస్తున్నది. పైగా,  ప్రత్యేక హోదా పుల్‌స్టాప్ పెట్టే అంశం కాదని, ఏపీ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా అని స్పష్టం చేయడం ద్వారా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నే సవాల్ చేస్తిన్నట్లు అయింది. 

హోదా కోసం ప్రధాని చొరవ చూపాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.  ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అధికార టీడీపీ ఒప్పకోవడమే కాకుండా హోదా కన్నా ప్యాకేజి ఎంతో మేలని అంటూ  చంద్రబాబునాయుడు చెబుతూ ఉండటం గమనార్హం. ప్యాకేజీ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించ మని మంత్రులను, పార్టీ నాయకులను ఆదేశించారు కూడా. 

కానీ పార్టీ ఎమ్మెల్యే మోదుగుల మాత్రం ఏపీ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా అని అనడం పార్టీలో కొత్త వివాదం రేపినట్లు అయింది. ఇంతకు ముందు నరసరావుపేట యంపీగా ఉన్న తనను మంత్రి పదవి ఇస్తామని ఎమ్మెల్యే గా పోటీ చేయించి, గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వక పోవడంతో మోదుగుల అసంతృప్తిగా ఉన్నారు. దానితో ఆయనపై పార్టీ మారతారని కధనాలు కూడా వస్తున్నాయి. 


చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted 37 minutes ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted 6 hours ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted 8 hours ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted 9 hours ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 10 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted 10 hours ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted 11 hours ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted 11 hours ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!