రాహుల్‌ గోబ్యాక్‌ అంటూ తెలుగు తమ్ముళ్ల నిరసనలు

Posted 9 months ago | Category : state politics

గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సదస్సులో పాల్గొనడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రావడంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పలుచోట్ల నిరసనలు తెలిపారు. కృష్ణా జిల్లా కేసరపల్లి దగ్గర టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రాహుల్‌ గోబ్యాక్‌ అంటూ నల్లజెండాలతో  ఆందోళన నిర్వహించారు.

రాహూల్ గాంధీ విజయవాడ వద్ద కే హోటల్ కు చేరుకోగానే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతోపాటు పలువురు టీడీపీ నేతలు హోటల్ దగ్గరకు చేరుకుని రాహూల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హోటల్ లోకి దూసుకెళ్లేందుకు వారు యత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రాహుల్ గాంధీ రావడాన్ని టీడీపీ శ్రేణులు మంగళగిరి జాతీయ రహదారిపై, చినకాకాని, తాడేపల్లి పాత టోల్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై నల్లజెండాలతో నిరసన తెలుపుతూ.. ‘తెలుగు జాతిని నిలువునా చీల్చిన నేతలు వెనక్కి వెళ్లాలి’ అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేస్తున్నారు.

రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా గుంటూరు మార్కెట్‌ సెంటర్‌ హిందూ కళాశాల కూడలి వద్ద తెదేపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. ‘రాహుల్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిర్చి యార్డు ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.కాంగ్రెస్‌ పార్టీ తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని,  రాహుల్‌గాంధీ రాష్ట్రంలోకి అడుగుపెట్టే ముందుకు తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

కాంగ్రెస్‌, వైకాపా కలిసి ప్రజలను మోసంగించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు.


చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted 35 minutes ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted 6 hours ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted 8 hours ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted 9 hours ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 10 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted 10 hours ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted 11 hours ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted 11 hours ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!