//single page style gallary page

త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌ సినిమా డైలాగ్స్.

Posted a year ago | Category : state politics

త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌ గుర్తు ఉన్నాడు కదా... టీడీపీ నుంచి కేసీఆర్ గులాబీ దళంలో చేరిన శీనన్న ఈ మ‌ధ్య దూకుడు మ‌రింత పెంచిండు. స‌భ‌లు స‌మావేశాల్లో శృతి మించి మరి ప్రతిపక్షాలపై రెచ్చిపోతున్నాడు అంతేకాదు కేసీఆర్ ను నెత్తిన పెట్టుకొని మోస్తా అంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన షాద్‌న‌గ‌ర్ మీటింగ్‌లో అటు టీడీపీ,ఇటు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఏకిపారేసిండు.కాంగ్రెస్ పార్టీ పీసీసీ నేత ఉత్త‌మ్‌కుమార్‌ రెడ్డిని 'గ‌డ్డ‌పోడు' అంటూ పోల్చిండు. ఇక రేవంత్‌రెడ్డి 'గీతాంత పొట్టోడు' అంటూ ఘాటుగానే విమ‌ర్శించాడు. రైతుల మీద అపార‌మైన ప్రేమ ఉందంటూ చెబుతున్న పార్టీలు ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం చేశాయంటూ ప్ర‌శ్నించాడు. అంతేనా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి తాము అధికారంలోకి వ‌స్తే రెండుల‌క్ష‌ల రూపాయ‌ల రుణ‌మాఫీ అంటూ చెప్ప‌టం సాధ్యంకాద‌ని భ‌విష్య‌త్తులో వారు అధికారంలోకి వ‌చ్చే ముచ్చ‌టేలేదంటూ ధీమా వ్య‌క్తంచేశాడు.

రాహుల్‌గాంధీ వ‌చ్చేనెల‌లో ప‌ర్య‌ట‌కువ‌స్తున్నాడ‌ట‌, మ‌రో నేత అమిత్‌షా ఆల్రెడీ రాష్ట్రంలో తిరుగుతున్నాడ‌ని. అయినా గులాబీ పార్టీలో చిన్న ఆకును కూడా క‌ద‌ప‌లేర‌న్నాడు. అంతేకాదు 'మొక్కే క‌దా అని పీకేస్తే.. పీక‌కోస్తా' అంటూ ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చెప్పిన‌ట్లుగా 'కేసీఆర్‌ఫై నోరు జారితే నాలుక కోస్తానంటూ' డైలాగ్ కొట్టాడు మనోడు.వామ్మో దీనిబట్టి చూస్తే సినిమాల ప్రభావం రాజకీయ నాయుకులపైనా కూడా బాగానే పనిచేస్తుంది అనమాట.ఇది ఇలా ఉండగా కేసీఆర్‌పై అంత అభిమానం, అంత ప్రేమ‌ నిజమేనా..? అంటూ గులాబీ వర్గాలు గుసగుసలాడుతున్నారు. టీడీపీ నుంచి వ‌చ్చిన‌ ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ రావాలన్న,తన కొడుకు కూడా ఏదోఒక నామినేటెడ్ పోస్టు పట్టాలన్నా ఈ మాత్రం పెద్దాయ‌న‌ను కాకా ప‌ట్ట‌క తప్పదంటున్నారు గులాబీ కార్య‌క‌ర్త‌లు.ఏమో చూద్దాం కేసీఆర్ తలసాని శీనన్న సినిమా డైలాగ్ కు పడిపోయి సీటు ఇస్తాడో లేదో....ఏదిఏమైనా తలసాని శీనన్న మాత్రం ప్రతిపక్షాలకు తన డైలాగులతో సినిమా చూపిస్తున్నాడు.


భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

Posted 16 hours ago | Category : national state technology

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

తెలియకుండా గర్భవతిని చేసారు

Posted 16 hours ago | Category : state

తెలియకుండా గర్భవతిని చేసారు

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 19 hours ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 20 hours ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted a day ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted a day ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted a day ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted a day ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted a day ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted a day ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 2 days ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!