రోజా ఫై ఫైర్ అయిన సునీత.

Posted 3 months ago | Category : politics

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాపై టీడీపీ మహిళ అధ్యక్షురాలు విరుచుకుపడ్డారు. ఒక అబద్దాన్ని పదిసార్లు చెబితే అది నిజమని, ప్రజలు నమ్ముతారనే భ్రమలో రోజా ఉన్నారని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. రాజధానిలో కాల్‌మనీ, విద్యార్థుల ఆత్మహత్యలు తప్ప రోజాకు చెప్పడానికి ఏమీ కనిపించటం లేదన్నారు.

టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సునీత మాట్లాడుతూ కాల్‌మనీ వ్యవహారాన్ని బయటకు తీసుకు వచ్చిందే తెలుగుదేశం నేతలు అన్న సంగతిని రోజా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. దీనిని అరికట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, రోజా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని ఇచ్చి మహిళా క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యాన్ని ఈ ప్రభుత్వం నింపుతోందని చెప్పారు. సంస్కారం అంటే అర్ధం తెలియని రోజా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తే తెలుగుదేశం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇక నుంచైనా ఆమె నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.


రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 19 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 20 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 21 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 21 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted a day ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted a day ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted a day ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted a day ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted 2 days ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు