ఇక ఎవరినీ సహించం: యూపీ డీజీపీ సుల్ఖాన్‌ సింగ్‌

Posted 10 months ago | Category : national politics

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలీసు శాఖలో భారీ మార్పు శనివారం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు డీజీపీగా పనిచేసిన జావేద్‌ అహ్మద్‌ స్థానంలో సుల్ఖాన్‌ సింగ్‌ను నియమించారు. సుల్ఖాన్‌ సింగ్‌ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుల్ఖాన్‌ సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవరిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వారు అనే విషయంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్ట్రిక్ట్‌ ఆర్డర్స్‌ పాస్‌ చేశారని ఆయన వెల్లడించారు.

అవినీతి విషయంలో అసలు సహించేది లేదని తేల్చి చెప్పారు. గూండాగిరిని నియంత్రించడానికి పూర్తి స్థాయిలో నిష్పక్షపాత ధోరణితో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పనిచేస్తారని అన్నారు. యాంటీ రోమియో స్క్వాడ్ అంశంపై స్పందించిన ఆయన అభ్యంతరకరంగా ప్రవర్తించిన వారి విషయంలోనే యాంటీ రోమియో స్క్వాడ్ చర్యలు ఉంటాయని తెలిపారు. ఎవరైనా సరే గోరక్షణ, ఇతర పేర్లతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని సుల్ఖాన్‌ సింగ్‌ హెచ్చరించారు.

సుల్ఖాన్‌ సింగ్‌: 37 ఏండ్ల సర్వీసు సర్వీస్ ఉన్న ఆయన కేవలం 3 లక్షల విలువ జేసే 2.3 ఎకరాల పొలం, లక్నోలో ఓ మూడు గదుల ఇల్లు తప్ప తనకంటూ ఏ ఆస్తిని సంపాదించుకోలేదంటేనే తెలుస్తుంది ఆయన ఎంత నిజాయితీ పరుడో. 2007లో ములాయంసింగ్ హయాంలో జరిగిన భారీ పోలీసు రిక్రూట్‌మెంట్ స్కాం బయటపెట్టడంతో డీజీపీ కాలేకపోయాడు, లేకుంటే ఎప్పుడో డీజీపీ అయ్యేవాడు. ఆ తరువాత మొత్తం నాన్ ఫోకల్ పోస్టుల్లోనే వేశారు. అఖిలేష్ హయాంలో కూడా తన ప్రతిభకు న్యాయం జరగలేదు.2012లో ఈ సుల్కాన్ సింగ్‌కన్నా ఎనిమిది మెట్లు కింద ఉన్న జావీద్ అహ్మద్‌ను డీజీపీగా వేశారు అఖిలేష్. బీజేపీ అధికారంలోకి రావటంతో పరిస్థితి మారింది. నిజాయితీ కి పట్టం కడుతూ సుల్ఖాన్‌ సింగ్‌ డీజీపీ చేసిన యోగిని ప్రతిఒక్కరం అభినందించాలి. సుల్ఖాన్‌ సింగ్‌ పదవి కాలం మరో ఏడాదితో ముగియనున్నది.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 41 minutes ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు