లాలూ కుటుంభంలో వారసత్వంపై మీమాంస !

Posted 9 months ago | Category : national politics

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ముగిసిపోయింది అనుకున్న మరో నాలుగు కేసులలో తిరిగి విచారణ ప్రారంభం కావడంతో మళ్ళి అరెస్ట్ కావడానికి  ఆయన మానసికంగా సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి అరెస్ట్ అయితే పరిస్థితులు గతంలో వలే రాజసంగా ఉండబోవని భావిస్తున్నారు. 

2013లో రాంచి జైలు లో ఉన్నప్పుడు అక్కడి జెయంయం ప్రభుత్వం ఆర్ జె డి కి చెందిన ఐదుగురు యం ఎల్ ఏ ల మద్దతుతో నడుస్తున్నది. కాబట్టి ఆయన జైలు నుండే రోజూ ’దర్భార్’ నడుపుతూ ఉండేవారు. ఇంట్లో వండిన ఆహారమే వచ్చెది. కానీ ఇప్పుడు అక్కడ బిజెపి ప్రభుత్వం ఉండడంతో పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. 

మరో వంక జైలుకు వెడితే పార్టీ బాధ్యతలు ఎవ్వరికి అప్పచెప్పాలో లాలూ నిర్ణయించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కుటుంబంలో బీహార్ లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న చిన్న కుమారుడు తేజశ్వి యాదవ్ క్రియాశీలకంగా ఉన్నారు. అయితే అతని పార్టీ సారధ్యం అప్పజెబితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభావంతో యుపిలో అఖిలేష్ యాదవ్ వలే పార్టీని కైవసం చేసుకొనవచ్చని అనుమానిస్తున్నారు. 

మంత్రిగా ఉన్న పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ రాజకీయాలలో ఇంకా నిలదొక్కుకోలేక పోతున్నాడు. మంత్రిగా రాణించలేక పోతున్నాడు. ఇక రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న కుమార్తె మీసా కు పార్టీ సారధ్యం అప్పచెప్పడమే చేయవలసి ఉంది. అయితే వచ్చే సంవత్సరం యం ఎల్ సి గా ఆరేళ్ళ సమయం పూర్తి చేసుకోబోతున్న భార్య రబ్రీ దేవి సహితం అందుకు పోటీగా వచ్చే అవకాశం ఉంది. గతంలో సియం గా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు ఆమెను  ఆ పదవిలో ఉంచడం తెలిసిందే. 

ఏది ఏమైనా సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చినప్పటి నుండి లాలూ మౌనంగా ఉంటున్నారు. తన న్యాయవాదులు చూసుకొంటారని అంటూ మీడియా కు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో సియం తో వైరుధ్యం ప్రమాదకరమని నితీష్ తో ఘర్షణకు సిద్దపడటం లేదు. నితీష్ కు కూడా పాలనలో అడ్డుపడకపోతే చాలు అన్నట్లు ఏమీ జరగన్నట్లే వ్యవహరిస్తున్నారు. 


కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు