ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కాలిఫోర్నియాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

Posted 5 months ago world state

అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ముబీన్ అనే విద్యార్థి 2015 ఫిబ్రవరిలో మాస్టర్స్ విద్యను అభ్యసించేందుకు అక్కడకు వెళ్లాడు. రెండు నెలల క్రితం అతని కోర్స్ పూర్తయింది. ప్రస్తుతం ఓ స్టోర్ లో అతను టెంపరరీ జాబ్ చేస్తున్నాడు. ముబీన్ షాపులో ఉండగా కొందరు నల్లజాతీయులు అక్కడకు వచ్చారు. ఓ విషయానికి సంబంధించి వారికి, ముబీన్ కు మధ్య కొంచెం వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో, ముబీన్ పై వారు కాల్పులు జరిపారు. బుల్లెట్ అతని కడుపులోకి దూసుకుపోయింది. ఘటన జరిగిన వెంటనే అతడిని ఈడెన్ మెడికల్ సెంటర్ కు తరలించారు. షికాగోలో ఉన్న అతని బంధువులు కాలిఫోర్నియాకు చేరుకుని, ముబీన్ వద్ద ఉన్నారు. ఈ సందర్భంగా చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ, బుల్లెట్ వల్ల లివర్ బాగా డ్యామేజ్ అయిందని తెలిపారు. ముబీన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

Most Read