ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతిష్టంభన

Posted 4 months ago politics

గుజరాత్‌ నుండి మంగళవారం మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతిష్టంభన నెలకొంది. ఇరువురు కాంగ్రెస్‌ సభ్యులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటమే కాకుండా, తమ ఓట్లను బీజేపీ ఎన్నికల ఏజెంటుకు చూపించారని ఇది ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘనేనని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆ రెండు ఓట్లను అనర్హమైనవిగా పేర్కొనాలని ఎన్నికల అధికారులను కోరింది.

మరోవంక బీజేపీ ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతూ వివాదాస్పదమైన రెండు ఓట్లను సక్రమమైనవిగానే భావించాలని ఎన్నికల అధికారులను డిమాండ్‌ చేసింది. బీజేపీ తరుపున ఆ పార్టీ అధ్యక్షులు అమిత్‌ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు కాంగ్రెస్‌ నుండి రాజీనామా చేసి బీజేపీలో చేరిన బల్వంత్‌ సిన్హా రాజ్‌పుట్‌ బరిలో ఉండగా, కాంగ్రెస్‌ తరుపున సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ పోటీలో ఉన్నారు.

గుజరాత్‌ అసెంబ్లీకి మొత్తం 176 స్థానాలున్నాయి. అందులో బీజేపీ 122 స్థానాలు కలిగి ఉంది. అందువల్ల అమిత్‌ షా, ఇరానీల గెలుపు ఖాయమైనట్లే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడం కాంగ్రెస్‌, కాషాయ పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ విషయమై పార్టీలు రెండు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. కాంగ్రెస్‌ నేతలు పి చిదంబరం, రణదీప్‌ సూర్జేవాల, ఆర్‌పిఎన్‌ సింగ్‌లు ఎన్నికల కమిషన్‌ను కలుసుకుని తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేయాలని కోరారు.

క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న కాంగ్రెస్‌ ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం కాదని బీజేపీ తెలిపింది.కేంద్ర మంత్రులు ఎంఎ నఖ్వీ, పియూష్‌ గోయల్‌, అరుణ్‌ జైట్లీ, రవి శంకర్‌, నిర్మల సీతారామన్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌ అధికారులను కలుసుకుంది. ఓట్ల లెక్కింపును త్వరగా ప్రారంభించాలని కోరింది.

కాగా కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరూ తమ బాలెట్‌ పేపర్లను వారి అధీకృత ఏజెంట్‌కు చూపడానికి బదులు బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలకు చూపించారు. ఇది 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల చట్టంలోని 39వ నిబంధనను ఉల్లంఘించినట్లయ్యింది.

Related Articles

Most Read