ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కాంగ్రెస్ లో రేవంత 'బాహుబలి' నా లేక 'బలి' నా

Posted a month ago editorial

కాంగ్రెస్ అంటే మహా ఉద్దండులు ఉండే రాజకీయ సముద్రం. అక్కడ ఉండే రాజకీయ నాయకులు చూడని ఎత్తులు ఉండవు ఎదుర్కొని జిత్తులు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేసి ఇతర పార్టీల్లో రాజకీయం చెయ్యడం అంటే పెద్ద విషయం కాదు అనే వాదన ఉంది. మరి ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలోకి వెళ్తే రాజకీయం చెయ్యడం కత్తి మీద సామేనా..? ఇతర పార్టీల్లో శత్రువులు మిత్రులు అయినట్టు ఆ పార్టీలో కుదురుతుందా...? ఎక్కడి వరకో ఎందుకు ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ లో ఇది జరిగే అవకాశం ఉందా...? 

అంటే గడ్డం రుద్దుతూ ఆలోచించే పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చు. కెసిఆర్ పతనమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న నయా కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీలో వాళ్ళని తట్టుకుని నిలబడతారా...? రేవంత్ దూకుడు అక్కడ పాతుకుపోయిన సీనియర్లకు రుచిస్తుందా..? అంటే నూటికి 70 పాళ్ళు లేదనే చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కొందరు కాంగ్రెస్ మహిళా లీడర్లతో రేవంత్ ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందనేది ఎవరు కాదనలేని సత్యం.

రేవంత్ చేరడం ... ఆ తర్వాత సోషల్ మీడియా మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా , ప్రింట్ మీడియా వరకు రేవంత్ ఏ ప్రధాన శీర్షికలుగా వార్తలు ప్రసారమయ్యాయి. దీనితో అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు అందరూ రేవంత్ మీద లోపల ఫెయిర్ అయ్యారు. సన్నిహితుల వద్ద " గిదేంది రా బై ఏమైనా గెల్చినమా" అని చేతులు తిప్పే పరిస్థితి నెలకొంది. ఈ విషయం రేవంత్ వరకు వెళ్లినా " లక్ష్యం కనపడుతుంటే గుంతలు కనపడవు " అనే సామెతని ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నారు.

అయితే ఈ సామెత ఎంత కాలం పనికొస్తుంది...? రేవంత్ వారి అసహనాన్ని తట్టుకుని ఎంత కాలం రాజకీయం చేస్తాడు...? ఇవి అన్ని కాలం చెప్పాల్సిన చిక్కుముడులు. రేవంత్ అంటే ఎంతో ఇగో ఉన్న వ్యక్తి. తనని అందలం ఎక్కించిన పార్టీలోనే అక్కడి నేతలు కెసిఆర్ కి సపోర్ట్ చేస్తున్నారని లేదా అతనికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని గ్రహించి వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది అడుగుకో గుంతలో రేవంత్ ఎలా నిలబడగలరు..? త్వరలో పాదయాత్ర చేసినా అది ఎంత మేరకు పాత లీడర్లకు కొత్తగా అనిపిస్తుంది...? చెప్పలేని పరిస్థితి. ఏ ప్రశ్నకి సమాధానం దొరకదు. దొరికే సమయానికి రాజకీయం ఎలా ఉంటుందో చెప్పలేం.. చూద్దాం నిలబడతాడో...? వారిని నిలబెడతాడో..? లేదా పడతాడో...!

Most Read