దినకరన్ మద్దతు దారులకు స్పీకర్ నోటీసు

Posted 6 months ago | Category : politics

 అన్నాడీఎంకేలోని టీటీవీ దినకరన్ మద్దతుదారులైన 19 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ నోటీసులిచ్చారు. వారి వైఖరి ఏమిటో సెప్టెంబర్ 5లోగా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనపై 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులివ్వడం ఇది రెండోసారి. 

అన్నాడీఎంకేలోని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనం పట్ల తాము అసంతృప్తిగా ఉన్నామని, ముఖ్యమంత్రికి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని పేర్కొంటూ 19 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇటీవల గవర్నర్ విద్యాసాగర్‌రావుకు మెమొరాండం సమర్పించారు. శశికళ, దినకరన్ వర్గీయులైన ఈ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం పుదుచ్చేరి రిసార్ట్‌లో బస చేస్తున్నారు. పళనిస్వామి అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని, దినకరన్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

ఇలా ఉండగా, ఎఐఎడిఎంకె సర్వ సభ్య సమావేశం పేరిట ఈ నెల 12వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్వహించే సమావేశానికి వెళ్లవద్దని తన వర్గం ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ హెచ్చరించారు. సర్వ సభ్య సమావేశం నిర్వహించే అధికారం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. తన వర్గానికి చెందిన వారెవరైనా ఆ సమావేశానికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!