రాష్ట్రపతి అభ్యర్థిపై ఫలించని సోనియా విందు దౌత్యం !

Posted 9 months ago | Category : national politics

రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపాలని గత నెల రోజులుగా పలు పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉమ్మడి అభ్యర్థి గురించి ఒక నిర్ణయం తీసుకోవడం కోసం శుక్రవారం ఏర్పాటు చేసిన విందు సమావేశం తగు ఫలితం ఇవ్వలేక పోయింది. ఈ విషయమై ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్య పడలేదు.  అయితే ముందుగా తమ అభ్యర్థిని వెల్లడించ రాదనీ, ఎన్డీయే అభ్యర్థిని వెల్లడించే వరకు ఆగాలని నిర్ణయించారు. 

అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎన్‌డిఎ ప్రకటించినట్లయితే తమకెవరికీ అభ్యంతరం ఉండదని, ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని సమావేశం అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ  చెప్పారు. ఆ విధంగా చెప్పడం ద్వారా రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ పట్ల పలు ప్రతిపక్షాలు అంతగా ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.  

మొత్తం 17 పక్షాల నాయకుల ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితె పలువురు ప్రముఖులు పాల్గొనక పోవడం గమనార్హం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరుకాక పోవడం, మరుసటి రోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇస్తున్న విందుకు హాజరు కాబోవడం ప్రతిపక్షాలలో గందరగోళానికి దారితీస్తుంది.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. 

ఇప్పటికే తమిళ్ నాడు లో అధికారమలో ఉన్న ఏ ఐ ఏ డి యం కె కు చెందిన రెండు వర్గాలు, తెలంగాణలో అధికార పక్షం టి ఆర్ యస్, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించాయి. ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహితం ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకో లేదు. తమ రాష్ట్రానికి చెందిన గిరిజన అభ్యర్థిని బిజెపి నిలబెడితే తాము తప్పని సరిగ్గా మద్దతు ఇవ్వ వలసి ఉంటుందని ఇప్పటికే సంకేతం ఇచ్చారు. 

 రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరుగుతున్నాయని అంటూ, ఏకాభిప్రాయానికి రాలేని పక్షంలో అభ్యర్థి ఎంపికకు ఒక చిన్న కమిటీని ఎర్పాటు చేసి అన్ని ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతామని మమతా చెప్పారు. 


కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు