ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

చంద్రబాబు అమెరికా టూర్ తో సోలార్ ఎనర్జీ స్టోరేజ్

Posted 7 months ago state politics

ఆంధ్ర ప్రదేశ్ లో సోలార్ ఎనర్జీ స్టోరేజ్‌కు తన అమెరికా యాత్ర దోహదపడనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మీడియాతో అమెరికా పర్యటన వివరాలు తెలుపుతూ ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో నెలకొల్పామని, పవన విద్యుత్ ఉత్పాదనకు కూడా వెళ్లామని అంటూ సోలార్, విండ్ ఎనర్జీపైన ఫోకస్ పెట్టిన్నల్టు తెలిపారు.

సోలార్ విద్యుత్‌ స్టోరేజ్ అవసరం అని భావించి టెస్లాను సంప్రదించగా మన ఇంటి పైనే సోలార్ ప్యానల్ పెట్టుకుంటే గృహావసరాలు, కార్లకు అవసరమైన ఇంధనాన్ని వినియోగించుకునే అవకాశాన్ని టెస్లా అందిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో మొత్తం వాహనాలన్నీ ఎలక్ట్రికల్ వాహనాలే కాగలవని అంటూ సోలార్ స్టోరేజ్‌కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.

తొలిదశ అగ్రికల్చర్ పంపుసెట్లకు వెళుతున్నామని అంటూ సోలార్ ఉత్పాదకత, స్టోరేజ్‌తో రెండో దశ విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. గ్రామ స్థాయి, ఫీడర్ స్థాయి విద్యుత్ గ్రిడ్లను రూపొందిస్తామని అంటూ ఈ వినూత్న కార్యక్రమానికి సిలికాన్ వ్యాలీలోని వారందరితో మాట్లాడాక రూపకల్పన చేసిన్నట్లు తెలిపారు.

భారతదేశ విద్యుత్ రంగాన్ని సమూలంగా మార్చబోతున్న నిర్ణయం ఇదని, ఇదొక్క విప్లవాత్మక ముందడుగు అని అభివర్ణించారు. రాబోయే రోజులలో విద్యుత్ చార్జీలు పెంచకుండా వీలయితే తగ్గించాలన్నదే తన ఆలోచన అని అంటూ విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రపంచానికే భారతదేశం ఒక ఆదర్వంగా నిలిచేలా చేయాలన్నదే తన తపన అని అన్నారు.

వసాయంలో వ్యూహాలను మార్చి హార్టీకల్చర్, ఫిషరీస్, లైవ్ స్టాక్‌పై దృష్టిపెట్టామని అంటూ రెయిన్ గన్స్, నదుల అనుసంధానం, మొబైల్ లిఫ్టులు వంటి వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తున్నామని గుర్తు చేశారు.

ప్రపంచంలో వున్న బెస్టు టెక్నాలజీ ఏపీకి తీసుకురావాలని ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ అయినా ఐయోవా యూనివర్విటీ, నెదర్లాండ్ యూనివర్విటీ ల సహకారంతో రాష్ట్ర వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. రైతులను, సాధారణ పౌరులను పట్టి పీడిస్తున్న వ్యవసాయం, విద్యుత్ సమస్యలకు ఈ టూరులో ఒక పరిష్కారం వెతికానని పేర్కొన్నారు.

Most Read