ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

చంద్రబాబు కి హీరో శివాజీ ఐదు ప్రశ్నలు ఇవే ?

Posted 21 days ago state

హీరో శివాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఐదు ప్రశ్నలు వేశారు.

చాలా ఇబ్బంది కరమయిన ప్రశ్నలు. చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, మసిపూపి మారేడు కాయ చేస్తున్నారని, అవినీతి పెరగిపోయిందని శివాజీ ఆరోపించారు.

గౌరవనీయులైన చంద్రాబునాయుడు గారిని ఐదు ప్రశ్నలు వేస్తున్నాను.. ఈ ఐదు ప్రశ్నలకు గనక మీరు సూటిగా సమాధానం చెప్పగలిగితే ఇంకెప్పుడు మిమ్మల్ని ప్రశ్నించను అని మొదలుపెట్టి మొట్టమొదటి ప్రశ్న

1 . రుణమాఫీ ఎవరడిగారు?

రైతులకు మీరు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని అది పూర్తిగా చెయ్యగలిగారా..? రుణమాఫీ కావాలని ప్రజలు మిమ్మల్ని అడిగారా..? మీరు మానిఫెస్టోలో పెట్టారు.. మీరు చేస్తానని హామీ ఇచ్చారు.. కానీ ఇప్పుడు పూర్తిగా ఎందుకు మాఫీ చెయ్యలేదు అంటూ ప్రశ్నించారు..

2 . కాపులకు రిజర్వేషన్ లు..?

కాపు కులం, కాపు సామజిక వర్గం మొత్తం వచ్చి మిమ్మల్ని అడిగారా..? కాపు రిజర్వేషన్లు కల్పించండి సర్ మీరు మానిఫెస్టోలో పెట్టండని.. అయినా మీరు మానిఫెస్టోలో పెట్టారు.. ఇప్పుడేమో వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.. ఉద్దేశం ఏదైనా గాని మీరు పెట్టారా లేదా..? మీ మానిఫెస్టోలో పెట్టేముందు బీసీ సంఘాలతో చర్చించారా..? లేదు అయినా మీరు హామీ ఇచ్చారు.. మారి వాటిని నెరవేర్చారా..?

3 . ప్రత్త్యేక హోదా..?

ఆరోజు తిరుపతి ఎన్నికల ప్రచారంలో మీరు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి ప్రధాన మంత్రిని ఒప్పించి పదేళ్లు కాదు పదిహేనేళ్ళు రాష్ట్రానికి ప్రత్త్యేక హోదా ఇవ్వాలి.. ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రము ఎందుకు పనికి రాదు అని మీరు అన్నారా.. లేదా..? కానీ అది మిమ్మల్ని ప్రజలు అడిగారా..? మీకు మీరు అధికారం కోసం ఆరోజు హామీ ఇచ్చారు..మారి ఈరోజు దీనికి సమాధానం చెప్పండి..

4 . నిరుద్యోగ సమస్యా..?

బాబొస్తే జాబోస్తదని రాష్ట్రంలో ఉన్న గోడలు మొత్తం రాసారు..ఒకవేళ రాకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగునికి రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు.. మరీ ఇచ్చారా..? ఎప్పుడు ఇచ్చారు.. ఎవరికీ ఇచ్చారు..లెక్కలు బయటికి తీయండి..

5 . అవినీతి నిర్మూలన..?

రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడ చూసిన అవినీతి ఏరోలై పారుతుంది.. దానికి ఉదాహరణగా మా జిల్లాలో ఒక పెద్ద పదవిలో ఉన్న (నాయకుడి) కుమారుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, బడ్డీ కొట్ల దగ్గరనుంచి మొదలుపెట్టి అధికారుల దగ్గర దాక ఎటు చూసినా ఆ వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నారు.. వారిపై చర్యలు ఏవి అది మీకు నీతిగా కనిపిస్తుందా అంటూ శివాజీ చంద్రబాబుపై విరుచుకు పడ్డారు..

Most Read