ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నితీష్ పై హత్యా కేసు చేపట్టనున్న సుప్రీం కోర్ట్

Posted 4 months ago politics

లాలూ ప్రసాద్ తో  రెండేళ్ల బంధాన్ని తెంచుకొని, తిరిగి బిజెపి గూటిలోకి వెళ్లడం ద్వారా తన పదవిని కాపాడుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సుప్రీం కోర్ట్ లో అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. నితీష్ తనపై ఉన్న క్రిమినల్ కేసును చెప్పకుండా దాచిపెట్టినందుకు ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. 

న్యాయవాది ఎం.ఎల్.శర్మ ఈ పిటిషన్ వేశారు. దీనిపై తక్షణ విచారణ జరపాలంటూ పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమితవ రాయ్, ఎ.ఎం.ఖన్విల్కర్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. పిటిషన్ విచారణ తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. 

1991లో బర్హ్ నియోజవర్గంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు స్థానిక కాంగ్రెస్ నేత సీతారాం సింగ్ హత్య, పలువురు గాయపడిన సంఘటనలో నితీష్ కుమార్ ప్రమేయం ఉందని పిటిషనర్ తన పిటిషన్‌లో ఆరోపించారు. నితీష్‌పై ఎఫ్ఐఐర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. 

నితీష్‌పై క్రిమినల్ కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసినప్పటికీ ఎన్నికల కమీషన్  ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయలేదని, నితీష్ ఇప్పటికీ రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్నారని శర్మ పేర్కొన్నారు. 

అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తమపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా తెలియజేయాలంటూ 2002లో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నితీష్ బీహార్ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. 2004 నుంచి 2012 వరకూ తన అఫిడవిట్లలో నితీష్ తనపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసును బయటపెట్టలేదని పిటిషనర్ ఆరోపించారు.

Related Articles

Most Read