//single page style gallary page

6,000 మంది ఉద్యోగులను గెంటివేసిన ఎస్‌బీఐ

Posted a year ago | Category : business

రెండు కోట్ల మందికి  ఉద్యోగాలు కల్పిస్తామని అధికారమలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించక పోగా ఉన్న ఉద్యోగులకే ఉద్వాసన పలుకుతున్నట్లు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ధోరణి వెల్లడి చేస్తున్నది. ఈ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ భారీగా తన ఉద్యోగులను తగ్గించుకుంది. స్వచ్చంద పదవీ విరమణ పథకం, పదవీ విరమణలతో ఆరు వేలకు మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించేసింది.

గత మూడు నెలలో బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 2.80 లక్షల నుండి 2.73 లక్షలకు తగ్గిపోయింది. ఈ తగ్గింపు మరింత ఉండనుందని తెలుస్తోంది. పదవీ విరమణలతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15,460 మంది ఉద్యోగులు తగ్గిపోనున్నారని భావిస్తున్నారు. అంతేకాక డిజిటలైజేషన్‌తో పాటు తన అసోసియేట్‌ బ్యాంకులు తనలో విలీనమైన నేపథ్యంలో 10వేలకు మందికి పైగా ఉ‍ద్యోగులను కొత్త ప్రాంతానికి లేదా కొత్త పనివిభాగాలకు కేటాయించేందుకు ఎస్‌బీఐ ప్రణాళికలు రచిస్తోంది.

అసోసియేట్‌ బ్యాంకుల కన్సాలిటేషన్‌, డిజిటల్‌ చానళ్లలోకి మారే క్రమంలో దేశంలోనే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ బ్యాంకింగ్‌ దిగ్గజం ఉద్యోగ పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టింది. ఎక్కువమొత్తంలో పునర్నిర్మాణం విలీనంతోనే చోటుచేసుకుంటున్నట్టు తెలిసింది. ఒకే స్ట్రీట్‌లో ఎక్కువమొత్తంలో అవుట్‌లెట్లను నిర్మూలించేందుకు బ్యాంకు చూస్తోంది.

ఆగస్టు 6 నాటికి 594 బ్రాంచులు ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. 122 అధికారిక కార్యాలయాలను హేతుబద్ధం చేసింది. దీంతో వార్షికంగా రూ 1,160 కోట్లను ఎస్‌బీఐ ఆదా చేసుకోనుంది. ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాంటి ప్రైవేట్‌ రంగ బ్యాంకులు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. డిజిటల్‌ లావాదేవీలను పెంచుతూ తమ ఉద్యోగులకు కోత పెడుతున్నాయి. 2016 డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 90,421 మంది ఉ‍ద్యోగులుంటే, 2017 మార్చి నాటికి 84,325 మంది ఉద్యోగులున్నారు. 


టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted a day ago | Category : business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

Posted 12 days ago | Category : business

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

Posted 12 days ago | Category : business

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Posted 23 days ago | Category : business

భారీ నష్టాల్లో ముగిసిన  స్టాక్‌మార్కెట్లు

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

Posted a month ago | Category : business

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted a month ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted 2 months ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

Posted 2 months ago | Category : state business

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

Posted 2 months ago | Category : business state

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

Posted 2 months ago | Category : business

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

Posted 2 months ago | Category : business

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్