//single page style gallary page

రూ 1,000 కోట్లు తో శశికళ ఎమ్మెల్యేల కొనుగులు ?

Posted a year ago | Category : politics

తమిళ్ నాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి విఫల యత్నం చేసిన చిన్నమ్మ శశికళ పార్టీ ఎమ్మెల్యేలను తన వైపు టిప్పు కోవడానికి 

రూ 1,000 కొట్ల మేరకు ఖర్చు  తీవ్రమైన ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్‌ సెల్వాన్ని గద్దె దింపి తాను గద్దెనెక్కేందుకు చిన్నమ్మ తనకు అండగా నిలిచే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.6 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారట. పైగా, పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీకి కటకట ఉండటంతో కొంత మొత్తాన్ని బంగారం రూపంలో ఇచ్చారని స్వయంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేనే వెల్లడించారు. 

చిన్నమ్మ ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌తో ఉబ్బితబ్బిబ్బయిన ఎమ్మెల్యేలు ఇళ్లు వాకిళ్లను,పెళ్లాం బిడ్డలను, తమను ఎన్నుకున్న ప్రజలను వదిలి ఏకంగా 15 రోజులు చెన్నై శివారులోని కూవత్తూరు రిసార్టులో కొలువుదీరారు. ఓ ఆంగ్ల, తమిళ చానళ్లు సంయుక్తంగా స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి చిన్నమ్మపై ఎమ్మెల్యేల ‘విశ్వాసం’ ఖరీదు ఎంతో నిగ్గుతేల్చాయి. 

తొలుత శశికళ వర్గంలో ఉండి ఆ తర్వాత ఓపీఎస్‌ వర్గంలో చేరిన మదురై దక్షిణ ఎమ్మెల్యే శరవణన్‌ ఈ ‘స్టింగ్‌ ఆపరేషన్‌’లో వెల్లడించిన వివరాలు ఆసక్తి కలిగించినా ఆశ్చర్యం మాత్రం కలిగించలేదు. 

ఓపీఎస్‌ తిరుగుబావుటా ఎగురవేసినట్లు తేలిపోగానే అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలందరూ చెన్నైకి రావాలని శశికళ ఆదేశించారు. దూర ప్రాంతాల వారు విమానాల్లో, అవి అందుబాటులో లేనివారు రైలు, రోడ్డు మార్గాల్లో బయలుదేరారు. వీరందరికీ శశి వర్గం నుంచి ప్రత్యేక వాహనాలు ఎదురెళ్లాయి. ఆ వాహనాల్లోకి ఎక్కుతున్నప్పుడే తనకు అండగా నిలుస్తున్నందుకు చిన్నమ్మ రూ.2 కోట్లు ఇస్తారన్న హామీ లభించింది.

అనంతరం గవర్నర్‌ వద్దకు బలప్రదర్శనకు వెళ్లేటప్పుడు మరో రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.4 కోట్లు ఇస్తామన్నారు. గవర్నర్‌ నిర్ణయం వెలువడటంలో జాప్యం అవుతుండటంతో రేటు మరింత పెరిగింది. గవర్నర్‌ నిర్ణయం వెలువడే వరకు కూవత్తూరు రిసార్టులోనే ఉండేందుకుగాను మరో రూ.2 కోట్లు మొత్తం రూ.6 కోట్లు ఇస్తామని శశికళే స్వయంగా హామీ ఇచ్చారు. 

"అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా కరెన్సీ దొరకడం ఇబ్బందిగా ఉందని, అంత మొత్తం నగదు రూపంలో ఇవ్వలేమని, కొంత బంగారంగా ఇస్తామని శశికళ ఎమ్మెల్యేలకు సూచించారు. దానికి అందరూ అంగీకరించారు. దీంతో తన వర్గంలోకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ శశికళ హామీ ఇచ్చిన మొత్తాన్ని అందజేశారు" అని శరవణన్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో వివరించారు. కాగా, తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలకు ఓపీఎస్‌ కూడా రూ.కోటి ఇచ్చినట్లు శరవణన్‌ తెలిపారు. అయితే ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ బూటకమని అధికార అన్నాడీఎంకే కొట్టివేసింది.


రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 41 minutes ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted an hour ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted 3 hours ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted 3 hours ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted 4 hours ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted 4 hours ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 19 hours ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 19 hours ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 19 hours ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్

మోదీ దాచిపెట్టిన రహస్యం.. బ‌య‌ట‌ప‌డిన భారీ కుట్ర‌..!

Posted 21 hours ago | Category : politics

మోదీ దాచిపెట్టిన రహస్యం.. బ‌య‌ట‌ప‌డిన భారీ కుట్ర‌..!

2019లో బీజేపీ ఘోర ఓట‌మి..!!

Posted 21 hours ago | Category : politics

2019లో బీజేపీ ఘోర ఓట‌మి..!!