ఆదిత్యనాథ్ `యువసేన' పై ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఆగ్రహం !

Posted 9 months ago | Category : national politics

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవి చేపట్టి రెండు నెలలు పూర్తవుతుండగా ఆయన ప్రారంభించిన  హిందూ యువ వాహిని ప్రాబల్యం పెరుగుతూ ఉండడంతో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఎంపీగా ఉన్న గోరక్‌పూర్‌ ప్రాంతానికే పరిమితమైన ఈ వాహిని ఇప్పుడు  రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా  విస్తరిస్తున్నది.

కాషాయ రిబ్బన్లు ధరించి పలు చోట్ల దూకుడుగా వ్యవహరిస్తూ వార్తలలోకి ఎక్కుతున్నారు. ఉధృత హిందుత్వ వాదులుగా వ్యాపించే ప్రయత్నం చేస్తున్నారు. 15 ఏళ్ళ అనంతరం రాష్ట్రంలో లభించిన అధికారం, మరో రెండేళ్లలో రానున్న లోక్ సభ ఎన్నికలు దృష్ట్యా వాహిని కార్యకర్తల దౌర్జన్య చర్యల కారణంగా తమకు తీరని నష్టం కలిగించ గలదని బిజెపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. 

గత ఫిబ్రవరి వరకు వాహినిలో చేరడం కోసం నెలకు 500 నుండి 1000 వరకు దరఖాస్తులు వచ్చెడివని, కానీ ఇప్పుడు రోజుకు ఐదు వేల వరకు వస్తున్నాయని తెలుస్తున్నది. పెరుగుతున్న ఈ ప్రాబల్యం ఆర్‌ఎస్‌ఎస్‌ కు అసంతృప్తి కలిగిస్తున్నది. 

పెరుగుతున్న వాహిని ప్రభావం పట్ల రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ మౌర్య బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాహిని పేరు ఎత్తకుండా పెరుగుతున్న ఇతర యువసేనలను సహించేదిలేదని, పార్టీ పరంగా అన్నీ ప్రాధాన్యతలు మొదట పార్టీకి, కార్యకర్తలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. 

సోమవారం జరిగిన సమన్వయ సమావేశంలో సీనియర్  ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు వాహిని కార్యకర్తల ఆగడాల పట్ల తమ అసంతృప్తి ని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. పైగా గోరక్షకులతో పాటు సంఘపరివార్ సంస్థలకు చెందినవారు చట్టాన్ని చేతిలోకి తీసుకొనే సహించెడిది లేదని అంటూ  పలు సార్లు ముఖ్యమంత్రి  బహిరంగ వేదికలపై హెచ్చరికలు జారీచేయడం పట్ల కూడా ఆక్షేపణ తెలిపినట్లు తెలిసింది. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!