రాహుల్ చైనా రాయబారిని కలిసారని పెను దుమారం !

Posted 7 months ago | Category : politics

భారత్ - చైనా సరిహద్దులో సిక్కిం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో జి20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తో కరచాలనం,  కౌగిలింత, పలకరింపులతో సరిపుచ్చుకొని సరిహద్దులో చైనా సైన్యం దుశ్చర్యల గురించి ప్రశ్నించలేదని  ప్రతిపక్షాలు పెదవి  విరుస్తున్న సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడ చైనా రాయబారి  ఝావోహుయ్‌ని కలిశారన్న వార్త పెనుదుమారం రేపుతున్నది. 

ఈ విష‌యాన్ని మొదట చైనా ఎంబ‌సీయే ట్వీట్ చేసినా, త‌ర్వాత డిలీట్ చేసింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ వార్త‌ను ఖండించింది. రాహుల్ చైనా రాయ‌బారిని క‌ల‌వ‌లేద‌ని స్ప‌ష్టంచేసింది. ఇదో ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది. చైనా రాయ‌బారిని రాహుల్‌ క‌లిశారంటూ కొన్ని న్యూస్ చానెల్స్ ఫేక్ న్యూస్‌ను న‌డిపిస్తున్నాయ‌ని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. 

మోదీ భక్తునిగా మారాల‌నుకుంటున్న ఓ చానెల్, ముగ్గురు కేంద్ర మంత్రుల చైనా ప‌ర్య‌ట‌న‌ను, జీ20లో చైనా అధ్య‌క్షుడితో స్నేహంగా ఉన్న ప్ర‌ధానిని ప్ర‌శ్నించ‌కుండా ఫేక్ న్యూస్ న‌డిపిస్తున్న‌ద‌ని ఆయ‌న ట్వీట్  లో ఆరోపించారు. నిజానికి ఈ అంశంపై గ‌త శుక్ర‌వార‌మే రాహుల్ ట్వీట్ చేశారు. చైనా అంశంలో ప్ర‌ధాని ఎందుకు సైలెంట్‌గా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు.

జీ20 స‌ద‌స్సులో క‌లిసిన‌పుడు కూడా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను చైనా అధ్య‌క్షుడి ద‌గ్గ‌ర మోదీ ఎందుకు ప్ర‌స్తావించ‌లేద‌ని కాంగ్రెస్ ప్ర‌శ్నిస్తున్న‌ది. అంతేకాదు రాహుల్ చైనా రాయ‌బారిని క‌లిసినా అదో పెద్ద విష‌యం కాద‌ని కాంగ్రెస్ సోష‌ల్ మీడియా హెడ్ ర‌మ్య అన్నారు.


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 14 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!