గాంధీ ` తెలివైన వైశ్యుడు' అన్న అమిత్ షా వాఖ్యపై పెనుదుమారం

Posted 8 months ago | Category : national politics

జాతిపిత‌ మ‌హాత్మాగాంధీ  `తెలివైన వైశ్యుడు' అంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగింది. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్, తృణముల కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. 

 చ‌త్తీస్‌గ‌డ్‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బీజేపీ నేత అక్క‌డ జ‌రిగిన ఓ స‌మావేశంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌హాత్మా గాంధీ ఓ తెలివైన కోమ‌టి వ్యాపారి అని, భ‌విష్య‌త్తులో కాంగ్రెస్ పార్టీకి ఏమ‌వుతుందో ఆయ‌న‌కు ముందే తెలుసు అని షా చెప్పారు.  కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ‌ల‌హీన‌త‌లు మ‌హాత్మా గాంధీకి తెలుసు అని, అందుకే స్వాతంత్ర్యం త‌ర్వాత కాంగ్రెస్ పార్టీని ర‌ద్దు చేయాల‌ని గాంధీ సూచించార‌ని షా విమ‌ర్శించారు.

 కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు, సూత్రాలు లేవంటూ స్వాతంత్ర్యం కోసం ఏర్పాటు చేసిన ఓ ప్ర‌త్యేక వాహ‌న‌మే కాంగ్రెస్ పార్టీ అని ఆయ‌న విమ‌ర్శించారు. దేశంలో ఉన్న 1650 రాజ‌కీయ పార్టీల్లో కేవ‌లం బీజేపీ, సీపీఎం పార్టీల్లో మాత్ర‌మే అంత‌ర్గ‌త స్వేచ్ఛ ఉంద‌న్నారు. సోనియా త‌ప్పుకుంటే, ఆమె ప‌ద‌వి రాహుల్‌కు వ‌రిస్తుంది, కానీ బీజేపీలో త‌దుప‌రి అధ్య‌క్షుడు ఎవ‌రు అవుతారో చెప్ప‌లేమ‌న్నారు.

అమిత్ షా మహాత్మ గాంధీని, దేశ స్వతంత్ర్య సంగ్రామాన్ని అవమాన పరచారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి  రణదీప్‌ సుర్జేవాలా విమర్శించారు. హిందూ మహాసభ, ఆర్ యస్ యస్ దేశాన్ని చీల్చడం కోసం బ్రిటిష్ వారికి `స్పెషల్ పర్పస్ వెహికిల్' వలే ఉపయోగ పడ్డారని ఆయన పేర్కొన్నారు.  ‘స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తిని ఇలా తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. 

అమిత్ షా వాఖ్యలు దురదృష్టకరమని, అనైతకమని అంటూ వెంటనే తన వాఖ్యలను ఉపసంహరించు కొని, జాతికి క్షమాపణ చెప్పాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మనం ప్రజల దగ్గర ప్రముఖుల గురించి మాట్లాడేటపుడు వారిని గౌరవించాలి. సున్నితమైన భాష ఉపయోగించి మాట్లాడాలి’ అని ఆమె హితవు చెప్పారు. 


జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted an hour ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!