ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

బాబుఫై రోజా మరోసారి ఫైర్...అమరావతి భ్రమరావతేనా..?

Posted 3 months ago politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. రాజధానిలో ప్రధాన భవనాల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే! ఈ తరుణంలో రోజా ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అంతేగాక అమరావతి నిర్మాణంపై చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? అమరావతి భ్రమరావతే అని ఎద్దేవా చేశారు.

ప్రపంచ స్థాయి హంగులతో రాజధానిని నిర్మిస్తా. ఇదే నా స్వప్నం అంటూ మాటలు కోటలు దాటిస్తున్నారు సీఎం చంద్రబాబు! డిజైన్లు మారుతున్నాయి, ఆర్కిటెక్ట్ సంస్థలు మారుతున్నాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి కానీ కలల రాజధాని అమరావతి నిర్మాణంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రధాన భవంతుల డిజైన్లపై ఎన్నికల సమయానికైనా ఒక స్పష్టత వస్తుందో రాదో తెలియని పరిస్థితి! ఏదో చేసేస్తున్నాం అని ప్రజలకు అమరావతిపై భ్రమలు కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన సైటైర్లు వేశారు.రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు..?

Related Articles

Most Read