వాళ్ళని చంపడమే చంద్రబాబు ధ్యేయం

Posted 2 months ago | Category : politics

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని వైకాపా మహిళా నేత రోజా వ్యాఖ్యానించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో జరిగిన 'మహిళా గర్జన' సదస్సుకు హాజరై ప్రసంగించిన రోజా, ఏపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తూర్పారబట్టారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు వద్దని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, తమ రహదార్లు జాతీయ రహదారులే కాదని, ఎన్నో ప్రధాన రోడ్లను ఒక్క జీవోతో డీ నోటిఫై చేసిన ఘనత చంద్రబాబు సర్కారుదేనని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడిముబ్బడిగా వైన్స్, బార్లను తెరిపించాడని, ఆడవాళ్ల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, ఆయనకు బుద్ధి చెప్పాలని అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఆడవాళ్ల కష్టాలు తీరుతాయని, జగనన్న మాటిస్తే, రాజన్న మాటిచ్చినట్టేనని, వైకాపా ప్రభుత్వం వస్తే, మద్య నిషేధం జరిగి తీరుతుందని రోజా హామీ ఇచ్చారు.

రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను తెచ్చింది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుని, ఆయన రక్తం పంచిన బిడ్డ జగన్ ను ఆదరించాలని అన్నారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఏపీ ప్రజలకు వారాలు కురిపించారు. ‘‘పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ను ఉచితంగా చదివిస్తాం. హాస్టల్‌ ఫీజు కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.2వేలకు పెంచుతాం. పెన్షన్‌దారుల వయసు 45 ఏళ్లకు తగ్గిస్తాం. పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం’’ అని జగన్‌ వారాలు కురిపించారు.


పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 hours ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 3 hours ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 6 hours ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

Posted 9 hours ago | Category : politics

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

Posted 10 hours ago | Category : politics

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

Posted 11 hours ago | Category : politics

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

Posted a day ago | Category : politics

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

Posted a day ago | Category : politics

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

Posted a day ago | Category : politics

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!

Posted a day ago | Category : politics

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!