హైదరాబాద్ స్లమ్ లో సంపన్న యువకుడి అజ్ఞాత జీవనం

Posted 6 months ago | Category : business

వేలకోట్ల రూపాయల సంపదకు వారసుడైన ఒక యువకుడు నెలరోజుల పాటు హైదరాబాద్ లోని అజ్ఞాతంలో  గడిపాడు. రూ 500 నోటు మాత్రమే తనతో తీసుకు వచ్చిన  అతను హైదరాబాద్ లోని ఒక మురికివాడలో, తానెవ్వరో ఎవ్వరికీ తెలియకుండా అతి సామాన్య జీవితం గడిపాడు.

గుజరాత్‌‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి అయిన ఘన్‌శ్యాం డోలాకియా కుమారుడే హితార్థ్. ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం వారిది. ఆ కుటుంబ ఆచారం ప్రకారం వ్యాపారంలోకి అడుగుపెట్టాలని భావించే వారు ఎవరైనా తప్పనిసరిగా నెల రోజులపాటు తమకు తెలియని ప్రాంతంలో సామాన్యుడిలా బతకాలి.

ఇప్పుడు హితార్థ్ చేసింది కూడా అదే. న్యూయార్క్‌లో చదువుకున్న అతడు తండ్రి మాట ప్రకారం రూ. 500తో హైదరాబాద్ వచ్చి చిన్నాచితక ఉద్యోగాలు చేసి నెల రోజులు గడిపాడు. రకరకాల ఉద్యోగాలు చేసి కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. తన ఉనికి బయటికి చాటకుండా ఇరుకు గదుల్లో, మురికివాడల్లో జీవనం వెళ్లదీశాడు.

తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి, హితార్థ్ ఫ్యామిలీకి స్నేహం ఉంది. అయితే తన కొడుకు హైదరాబాద్ వచ్చిన విషయాన్ని ఘనశ్యామ్ ఆయనకు తెలియనీయలేదు. నెల రోజులపాటు అజ్ఞాతంలో గడిపాకే కుటుంబ సభ్యులు వచ్చి హితార్థ్‌ను కలిశారు.

ఏటా పండుగల సమయంలో తన దగ్గర పనిచేసే వారికి కార్లు, ఖరీదైన ఫ్లాట్లు ఇస్తూ వార్తల్లో నిలిచే వజ్రాల వ్యాపారి ఈ సారి తన కొడుకును ఇలా బయటకు పంపి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో హితార్థ్ సోదరుడు కూడా ఇలాగే నెల రోజులపాటు వేరే ఊళ్లో గడిపాడు.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 8 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 9 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 9 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 9 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 11 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 12 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 16 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 16 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 16 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 17 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 17 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!