రేవంత్ దారెటు..

Posted 4 months ago | Category : politics

ఇక టీడీపీలో రేవంత్ రెడ్డి శకం ముగిసింది.

అందరూ ఊహించినట్టే రేవంత్ టీడీపీకి షాకిచ్చాడు. గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నాడని... కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడన్న వార్తలే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి కారణం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని వార్తలు రావడం.. కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి అని రేవంత్ రెడ్డి అనడం చూసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయం అనుకున్నారు.

కానీ సీన్ రివర్స్ అయి తాను పార్టీ మారేది లేదని... మీడియా చేస్తున్న రాద్దాంతం అని యూటర్న్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అంతా సర్దుకుంటుందీ అనుకునేలోపు మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈసారి ఏకంగా పార్టీకే రాజీనామా చేశాడు.

రేవంత్ రెడ్డి తన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దారెటు.. ఏ పార్టీలోకి జంప్ అవుతారు...? రేవంత్ నిర్ణయంపై చంద్రబాబు ఏలా స్పందిస్తారు...? ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలు. ఎందుకంటే.. ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి యుద్దమే చేస్తున్నాడు.

ఇప్పటికీ కేసీఆర్ పై... టీఆర్ఎస్ పైనే నా యుద్దం అని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పాడు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలే. ఏపీలో ఏలాగూ బీజేపీ-టీడీపీ మిత్రపక్షమే..కానీ తెలంగాణలో మాత్రం రెండు పార్టీలు వేరు వేరు. అంతేకాదు బీజేపీ పరిస్థితి కూడా తెలంగాణలో అంతగా లేదు.

కాస్తో కూస్తో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితే కొంచం బెటర్ గా ఉంది. అంతేకాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడన్న వార్తలు వచ్చినప్పుడు... రేవంత్ డిమాండ్లకు కాంగ్రెస్ ఒప్పుకుందని.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రేవంత్ రెడ్డినే నిలబెడతారన్న వార్తలు కూడా వచ్చాయి.

మరి ఇప్పుడు రేవంత్ డిమాండ్లకు కాంగ్రెస్ ఒప్పుకుంటుందా.. రేవంత్ రాజకీయ భవిష్యత్ ఏంటీ.. ఏ పార్టీలో చేరుతారు..? ఇవన్నీ తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!