//single page style gallary page

ఢిల్లీ వేదికగా కేసిఆర్ కి సవాల్ విసిరిన రేవంత్

Posted 8 months ago | Category : politics

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్న కొడంగ‌ల్ నేత‌ రేవంత్ రెడ్డి అక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణ కోసం 60 ఏళ్ల సుదీర్ఘ‌ పోరాటం జ‌రిగింద‌ని, సుమారు 15 వంద‌ల మంది ప్రాణత్యాగం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. తీరా తెలంగాణ వ‌చ్చాక కేసీఆర్ పాల‌న‌లో ప్ర‌జ‌ల క‌ల‌లు నెర‌వేర‌డం లేవ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో నిరుద్యోగం ఇప్పటికీ అలాగే ఉంద‌ని చెప్పారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంటే, తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌ని చెప్పారు. 

నిరుద్యోగులు ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నార‌ని చెప్పారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేద‌ని చెప్పారు. మూడున్న‌రేళ్ల‌లో కేసీఆర్ చేసింది ఏమీలేద‌ని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల క‌ల‌లు నెర‌వేరుతామ‌ని అన్నారు.  తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశించారని, అందుకే ఎలాంటి ప్రయోజనాలు చూడకుండా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. 

ఆంధ్రపదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా లెక్క చేయకుండా సోనియా తెలంగాణను ఇచ్చారని అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ ఎవర్నీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత 40 నెలల్లో 3,400మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన కొడుకు మంత్రి అయ్యారని, కుటుంబంలోని నలుగురికి పదవులు వచ్చాయని విమర్శించారు. 

పత్రిక, చానెల్‌ పెట్టి రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారితోనే కేసీఆర్‌ దోస్తీ చేస్తూ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌ నాయకత్వంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతామని రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డితోపాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో హస్తం శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 2 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 9 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 15 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 20 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 22 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 27 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 3 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!