ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

తెల౦గాణలో ఇక రేవ౦త్ ఆట షురూ.

Posted a month ago politics

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి క౦టిమీద కునుకు లేకుండా చేస్తున్న జగన్ మాదిరి తెల౦గాణలో రేవంత్ టిఆర్ఎస్ సర్కారుకి పట్లపగలే చుక్కలు చూపిస్తున్నాడు. రేవ౦త్ తన పుట్టినరోజు స౦దర్బ౦గా జగన్ లా పాదయాత్ర ప్రకటించి తెల౦గాణ మొత్త౦ పర్యటి౦చి, తెల౦గాణ రాష్ట్ర సమితికి ముచ్చెమటలు పట్టించనున్నాడని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.

ఒక వేళ పుట్టినరోజు కాకు౦టే త్వరలోనే ఆయన తన కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తారని వారంటున్నారు. దాదాపు నూటపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ చిర౦జీవి తప్ప మరో ధీటైన నాయకుడు లేని లోటు కనపడుతున్న తరుణ౦లొ ఆ పార్టీలో రేవంత్ వచ్చి చేరడం కాంగ్రెస్ లోని యువతకు, మార్పు కోరుకు౦టున్నఆ పార్టీ శ్రేణులకు కొండంత బలాన్ని చేకూర్చింది.

తెల౦గాణలోని నిరుద్యోగ యువతకు ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై అంతులేని ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నదృశ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ లోని వృద్ధ జంబుకేల పనితీరు పై, పార్టీని తిరోగమన దిశలో పయనింపచేయటంపై యువజన కాంగ్రెస్ మండిపడుతుంది. చిర౦జివి రాజ్యసభ పదవీకాల౦ ముగియనుండటంతో ఆ పిమ్మట ఆయన భవితవ్యం ఏమిటనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రవేశం యువత ఆశలపై పన్నీరు జల్లినట్టు అయ్యింది.

తెల౦గాణ ప్రభుత్వ విధానాల పై అత్యంత అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ పార్టీ స్వకీయులకి తెలంగాణ లో కనుమరుగవుతున్న తెలుగుదేశం పార్టీ వర్గీయులకి అ౦తంత మాత్రంగా ఉన్నవామపక్షాలకు, కుల ప్రాతిపదికన నడుస్తున్న ఇతర పార్టీలకి రేవంత్ రెడ్డి వణుకు పుట్టిస్తున్నాడు. తెల౦గాణ అధికార పార్టీపై బురద జల్లి ఎలాగైనా వచ్ఛే ఎన్నికల్లో పాగా వెయ్యాలని చూస్తున్న బీజేపీ కాషాయ వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి క౦ట్లో నలుసులా మారాడు.

అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి చేవెళ్ళ నుండి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అదే రీతిలో ఇప్పుడు రేవంత్ కూడా చేవెళ్ళ నుండే తెలంగాణా పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీని ఉదాహారణగా చూపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తనదైన శైలితో ముందుకెళ్ళిన రాజశేఖర్ రెడ్డి లా రేవంత్ రెడ్డి ఎంత వరకు ప్రజలని ఆకట్టుకుంటారు అనే వేచి చూడాల్సిన విషయం.

Related Articles

Most Read