ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నా నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారుతా..వైసీపీ ఎమ్మెల్యే

Posted 2 months ago politics

తూర్పుగోదావరి జిల్లా రంప చోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన విజయం సాధించింది. తాగునీటి వెతలను తీర్చలేకపోతోంది. అదే విషయంపై ఆమె తరచూ మీడియాతో మాట్లాడుతోంది. అయినా సమస్య తీరలేదు. మూడేళ్లుగా ఆమె ఇదే మాట చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తాను అసెంబ్లీలో ఈ సంగతి ప్రస్తావిద్దామన్నా జగన్ అందుకు అనుమతినివ్వలేదని బాధపడుతోంది. ఇలా ఉంటే తాను వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని భావిస్తోంది. అందుకే అభివృద్ధి కోసం పార్టీ మారితే బావుంటుందనే ఆలోచన చేస్తోంది. ఫలితంగా టీడీపీ జెండా పట్టేందుకు రాజేశ్వరి సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. ఆమె అనుచరులు ఇదే మాట చెబుతున్నారు.

జ్యోతుల నెహ్రు ప్రొద్భలంతోనే ఆమెకు గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్ టిక్కెట్ ఇచ్చారు. తన రాజకీయ గురువు జ్యోతుల నెహ్రు సైకిల్ ఎక్కడంతో ఆమె అదే బాట పట్టేందుకు సిద్దమైంది. రానున్న ఎన్నికలకు ముందు నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలుచేసి ప్రజల ముందుకు వెళ్లే పని చేయనుంది రాజేశ్వరి. అందుకు కలిసి వచ్చే ఏ అంశాన్ని వదలడం లేదు.

గిరిజన ప్రాంతం కావడంతో అక్కడి ప్రజలకు పెద్దగా రాజకీయాలు తెలియవు. గూడెం పెద్ద ఏం చెబితే దాన్నే ఎక్కువగా పాటిస్తారు వాళ్లు. ఇప్పుడు రాజేశ్వరి పార్టీ మారితే అందుకు పెద్దలు అనుమతి తీసుకోవాల్సి ఉంది. రోడ్లు, తాగునీరు వంటి సమస్యల పరిష్కారం కోసం పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నా. మీరు ఏమంటారని చాలా మంది గిరిజన పెద్దలను ఎమ్మెల్యే అడిగారంటున్నారు. ప్రజలకు మంచి చేసేందుకు ఏం చేసినా సమ్మతమేనని వారు చెప్పారని సమాచారం.

Related Articles

Most Read