విదేశీ పర్యటనలపై ఏదో దాస్తున్న రాహుల్ ... రాజ్ నాధ్ అనుమానం

Posted 6 months ago | Category : politics

స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్ లేకుండానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ టూర్ల‌కు వెళ్తున్నార‌ని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్  సింగ్ విస్మయం వ్యక్తం చేశారు. గుజరాత్ లో రాహుల్ గాంధీ కారు పై రాళ్ల దాడి జరిగిన సంఘటనపై లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళనకు స్పందిస్తూ  విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న రాహుల్ ఎందుకు ఎస్పీజీని తీసుకెళ్ల‌డం లేదో తెలుసుకోవాల‌ని ఉంద‌ని ఆయ‌న అన్నారు. 

రాహుల్‌ ఆరుసార్లు విదేశాల‌కు వెళ్లి, 72 రోజులు అక్క‌డ గ‌డిపారని అంటూ  ఆ స‌మ‌యంలో ఆయ‌న ఎస్‌పీజీని ఎందుకు తీసుకెళ్ల‌లేదో చెప్పాల‌ని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు. ఎస్పీజీ లేకుండా వెళ్లి రాహుల్ ఏదో దాస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

తన పర్యటనలలో భద్రత అంశాల పట్ల  రాహుల్ గాంధీ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగానే గుజరాత్ లో ఆయన కారుపై దాడి జరిగిన్నట్లు  రాజ్ నాధ్ సింగ్ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ కారు వాడ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు చెప్పారు. సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను రాహుల్ తరచూ ఉల్లంఘిస్తున్నారని అంటూ  ఎన్నో సార్లు రాహుల్‌కు ఈ విష‌యం గురించి చెప్పినా ఆయ‌న ప‌ట్టించుకోవడం లేదని హోమ్  మంత్రి విచారం వ్యక్తం చేశారు. 

రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న గురించి రెండు రోజుల ముందే గుజ‌రాత్ పోలీసుల‌కు షెడ్యూల్ అందింద‌ని, అయితే కాంగ్రెస్ నేత ఎస్‌పీజీ ర‌క్ష‌ణ‌లో ఉన్నార‌ని, రాష్ట్ర పోలీసులు రాహుల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భారీ బందోబ‌స్తు చేశార‌ని, ఆయ‌న కోసం బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఏర్పాటు చేసిన‌ట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. కానీ రాహుల్ బుల్లెట్ ప్రూఫ్ లేని కారులో టూర్‌కు వెళ్లార‌ని రాజ్‌నాథ్ విమ‌ర్శించారు. 

ఎస్‌పీజీ డ్రైవ‌ర్ కారును న‌డిపార‌ని, కానీ రాహుల్ అనేక చోట్ల కారు ఆపార‌ని, అది షెడ్యూల్‌లో లేద‌ని అన్నారు.  అయితే హెలిపాడ్‌కు వెళ్తోన్న స‌మ‌యంలో ఓ గుర్తు తెలియ‌న వ్య‌క్తి రాయి విసిరాడ‌ని,  ఆ వ్య‌క్తిని అరెస్టు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఒక‌వేళ రాహుల్ బుల్లెట్ ఫ్రూప్ కారు తీసుకుని వెళ్లి ఉంటే ఈ ఘ‌ట‌న జ‌రిగేది కాదు అని రాజ్‌నాథ్ అన్నారు. 

ఈ  అంశాన్ని కాంగ్రెస్ నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే లోక్‌స‌భ‌లో లేవ‌నెత్తుతూ  క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు రాళ్లు రువ్వుతున్నార‌ని ప్ర‌భుత్వం అంటోంది, మ‌రి గుజ‌రాత్‌లో ఎవ‌రు రాళ్లు రువ్వారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ అడ్డుకున్న‌ది. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం చెల‌రేగడంతో  స్పీక‌ర్ స‌భ‌ను వాయిదావేశారు.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!