10 శాతం ఓట్లే బలంగా రజనీకాంత్ ముందడుగు ... ఇతర నాయకులకు గాలం

Posted 9 months ago | Category : national politics


జయలలిత మరణంతో తమిళ్ నాడు లో ఏర్పడిన రాజకీయ సూన్యన్ని పూరించడం కోసం రాజకీయ రంగ ప్రవేశం పట్ల కృత నిశ్చయంతో ఉన్నప్పటికీ తన బలం సరిపోదని, అదనపు బలం సమీకరించు కోవాలని తమిళ్ సూపర్ స్టార్ రజనికాంత్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. బెంగుళూరు కు చెందిన ఒక ఏజెన్సీ ద్వారా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను, ఓటర్ల మనోభవాలను అధ్యయనం చేస్తున్నట్లు వినికిడి.

తన పేరుతో 10 శాతం కు మించి ఓట్లు రాకపోవచ్చని, అధికారంలోకి రావాలంటే మరో 20 శాతం ఓట్లు అవసరం రజనీకాంత్ కు ఆయనకు తెలుసు. అందుకనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన అభిమానులు అందరూ మధ్య వయస్సులో, లేదా 50వ వడిలో మధ్య తరగతి ప్రజలని, వారి మద్దతే సరిపోదని నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా యువత ఎటువైపు ఉంటారన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. 

2005లో తాను రాజకీయ పార్టీ ప్రారంభించాలి అనుకున్నప్పుడు విజయకాంత్ ప్రారంభించడం తెలిసిందే. అప్పుడు 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 8 శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. 2009 లోక్ సభ ఎన్నికల్లో 10 శాతంకు పెరిగాయి. కానీ 2014లో ఎన్ డి ఏ తో కలసినప్పుడు 5 శాతంకు పడిపోయాయి. ఇప్పుడు తన పరిస్థితి కూడా అంతకన్నా భిన్నంగా ఉండదని సూపర్ స్టార్ భావిస్తున్నారు. 

కొందరు ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ఆరాట పడుతున్నది. నరేంద్ర మోడీ తో స్నేహం ఉన్నప్పటికీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరంతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడే బిజెపి తో కలిస్తే ముస్లింలు, మరి కొన్ని వర్గాలు దూరం కావచ్చని వెనుకడుగు వేస్తున్నారు. అయితే పార్టీ ఏర్పాటు విషయంలో బిజెపి సహకారాన్ని పరోక్షంగా తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.

ప్రముఖ ఆర్ యస్ యస్ సైద్ధాంతిక వేత్త యస్ గురుమూర్తితో సమాలోచనలు జరుపుతూనే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇతర పార్టీలలోని ముఖ్యమైన నాయకుల కోసం గాలం వేస్తున్నారు. వారిలో ఏ ఐ ఏ డి యం కె లో మాజీ విద్య మంత్రి మా ఫోయ్ పాండిరాజన్ ఒకరు. ఆయన శశికళను వ్యతిరేకంగా పన్నీరుసెల్వం శిబిరంలోకి వెళ్లినా ఇప్పుడు అంత సఖ్యత లేదు. డీయంకే దూరంగా ఉంచుతున్న రెండు సార్లు ఎంపీగా, యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన యస్  జగత్రక్షకన్ తో పాటు  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కరాటే త్యాగరాజన్ ఆయనతో చేరే అవకాశం ఉంది. మరికొందరు  సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. 


కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు