ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

జాప్యం లేకుండా రైల్వే పనులు : ఎంపీ కవిత

Posted a month ago politics

నిజామాబాద్‌ నియోజక వర్గంలో రైల్వే పనుల్లో జాప్యం జరగకుండా చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ను నిజామాబాద్‌ ఎంపీ కవిత కోరారు. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో రైల్వే జీఎం చాంబర్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్‌, గణేష్‌ గుప్తా, జీవన్‌రెడ్డి, షకీల్‌, విఠల్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, మధు పాల్గొన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ నిజామాబాద్‌ - బొల్లారం డబ్లింగ్‌, నిజామాబాద్‌ - నాందేడ్‌ డబ్లింగ్‌, నిజామాబాద్‌ - బాసర వరకు రైళ్లు పొడిగించాలని జీఎంను కోరారు. బోధన్‌ - నిజామాబాద్‌ - మీర్జాపల్లి రైలును బొల్లారం, తిరుపతి - నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ బాసర వరకు, నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌, స్టేషన్‌ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

ఫకీరాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే గేటు వెడల్పు పెంచడంతో పాటు మామిడిపల్లి గ్రామంలో ఆర్‌యూబీ నిర్మించాలని, నాందేడ్‌ - బొల్లారం సెక్షన్‌ డబ్లింగ్‌ పనులు పూర్తి చేయాలని జీఎంకు వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ భాషలో సైన్‌ బోర్డుల ఏర్పాటు, నిజామాబాద్‌ నుంచి ముంబై షిరిడి కచ్‌లకు కొత్త రైళ్లు నడిపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్‌ రైల్వే స్టేషనను పవర్‌ స్టేషన్‌గా మార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అదనపు జీఎం జాన్‌ థామస్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్శియల్‌ మేనేజర్‌ ఎం.జి శేఖరం, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ అధికారి అరుణ్‌ కుమార్‌ జైన్‌ పాల్గొన్నారు.

Related Articles

Most Read