కాంగ్రెస్ లో ప్రభావం కోల్పోతున్న రాహుల్ `యూత్ బ్రిగేడ్' !

Posted 7 months ago | Category : politics

కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అధికారికంగా చేపట్టే ముందు పార్టీలో సీనియర్లు అందరిని పక్కన పెట్టి, నూతన తరాన్ని తెరపైకి తీసుకు రావడం కోసం రాహుల్ గాంధీ   కొంతకాలంగా `యూత్ బ్రిగేడ్' ను సిద్ధం చేశారు. అయితే పార్టీ వరుసగా పరాజయాలు ఎదుర్కోవడానికి అనుభవం లేని వీరి  నిర్వాకమే అని ఇప్పుడు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రహించారు. వారందరిని ప్రక్కన పెట్టి, తిరిగి సీనియర్లను దగ్గరకు తీయనిదె పార్టీ మనుగడ కష్టం అని తెలుసు కున్నారు. అందుకనే 2019 ఎన్నికల వరకు సోనియా గాంధీ క్రియాశీలకంగా పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. 

ఎన్ యస్ యు ఐ, యువజన కాంగ్రెస్ కమిటీలను ఎన్నికల ద్వారా నియమించి రాహుల్ కొత్త వరవడి సృష్టించారు. ఇపుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు నియామకం విషయంలో  సహితం సర్వేలు జరిపించారు. అయితే ఈ సర్వే ఫలితాలు రాహుల్ కు షాక్ కలిగించాయి. ఏ రాష్ట్రంలో కూడా `యూత్ బ్రిగేడ్' నాయకులకు అనుకూలంగా లేదు. 

ముఖ్యంగా వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో సచిన్ పైలట్, మధ్య ప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా, హర్యానా లో అశోక్ తన్వార్  లకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. చివరకు ఛత్తీస్ ఘర్ లో పార్టీపై తిరుబాటు చేసి సొంత పార్టీ పెట్టుకున్న అజిత్ సింగ్ అయితేనే పార్టీ నిలబడుతుందని సొంత పార్టీ వారే సర్వే లో అభిప్రాయం వ్యక్తం చేశారు.

 రాజస్థాన్ లో అశోక్ గేహోలోట్, హర్యానాలో భూపేందర్ సింగ్ హూడా, మధ్య ప్రదేశ్ లో కమల్ నాథ్, మహారాష్ట్రాలో అశోక్ చవాన్, గురుదాస్ కామత్, సుశీల్ షిండే వంటి నాయకులకే సానుకూల పరిస్థితులున్నాయి. రాహుల్ దూరంగా పెడుతున్నవారికే ప్రజలలో, పార్టీ కార్యకర్తలలో మద్దతు లభిస్తూ ఉండటం గమనార్హం. 

ఇక రాహుల్ ఏర్పాటు చేసిన మీడియా విభాగం ఆయన చైనా రాయబారిని కలసిన విషయమై పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేసి అప్రదిష్ట తీసుకు రావడంతో సోనియా ఆగ్రహం చెంది, సీనియర్లతో మరో పర్యవేక్షక కమిటీ వేయడం తెలిసిందే. 


రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 16 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted a day ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు