ప్రేమ కోసం రాజరికాన్ని వదులుకున్న రాకుమార్తె

Posted 5 months ago | Category : world

ప్రేమలో పడిన జపాన్ రాకుమార్తె అందుకోసం  తన రాజరికాన్నే వదులు కోవడానికి సిద్దపడింది. అంతగా ఒక సాధారణ వ్యక్తిలో నచ్చినది ఏమిటంటే  'అతని నవ్వు సూర్య కాంతి వలె వెలుగునిస్తుంది' దాన్ని చూసే తాను కొమెరోను ప్రేమించానని జపాన్‌ రాకుమారి మకో మురిపెంగా చెప్పేసింది. 

 జపాన్‌ రాకుమారి మకో, లీగల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కొమెరోలకు ఆదివారం ఘనంగా నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది శరదృతువులో ఇరువురికి రాజ సంప్రదాయాల ప్రకారం వివాహం జరగనుంది. ఈ మధ్య సమయంలో జపాన్‌ రాజ వివాహాల పద్దతుల ప్రకారం జరగాల్సిన కొన్ని కార్యక్రమాలను జరిపిస్తారు. 

ఓ సాధారణ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని  రాకుమారి మకో నిర్ణయించుకున్న విషయం తెలియడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.  గత మేలో మకో, కొమెరోను వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె తన తల్లిదండ్రులు అకిషినో, కికోలకు చెప్పారు.

జపాన్‌ రాజప్రాసాద చట్టం ప్రకారం రాజ వంశానికి చెందిన యువతి సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే రాజ గుర్తింపును వదులుకోవాలి. అంతేకాదు రాజ ప్రసాదం వదలి వెళ్లిపోవాలి.  వీటి అన్నింటికి తాను సిద్ధమని కొమెరోతో తన వివాహం జరిపించాలని తల్లిదండ్రులను కోరింది. 

టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందిన కొమెరో నిశ్చితార్థ సమయానికి మాత్రం లీగల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. స్కీయింగ్‌ చేయడం, వయెలిన్‌ ప్లే చేయడం కొమెరోకు బాగా వచ్చు. వంట కూడా అద్భుతః అనిపిస్తారట కొమెరో. 

పెళ్లి కోసం ఒక రాకుమారి సింహాసనాన్ని వదిలేసిన సందర్భం జపాన్‌ రాజవంశంలో ఇదే మొదటిది కాదు. మకో ఆంటీ సయాకో కూడా ఇలాగే ఒక సామాన్యుడిని చేసుకుని బయటికి వెళ్లిపోయారు. 


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!