//single page style gallary page

కాంగ్రెస్‌కు స్టార్ హీరో గుడ్ బై

Posted 8 months ago | Category : politics

క‌ర్ణాట‌క‌లో మ‌రికొద్ది నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అక్క‌డ కూడా నేత‌ల క‌ప్ప దూకుళ్లు పెరిగిపోయాయి. ఇప్ప‌టికే కొత్త పార్టీ కూడా ఒక‌టి తెర‌మీద‌కి వ‌చ్చింది. దీంతో రాజ‌కీయంగా రాష్ట్రంలో వేడి రాజుకుంది. క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను తెచ్చుకున్న మాజీ మంత్రి, న‌టుడు, అంబ‌రీష్ త‌న దారి తాను చూసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్యం బాగా దెబ్బ‌తిన‌డంతో మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించారు. దీనిని అవ‌మానంగా భావించిన స‌ద‌రు మాజీ హీరోగారు.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్ప‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

రాష్ట్రంలో ఒక‌ప్పుడు అధికార చ‌క్రం తిప్పిన మాజీ ప్ర‌ధాని దేవెగౌడ ఆయ‌న కుమారుడు కుమార స్వామి నేతృత్వ‌లోని జేడీఎస్‌కు మ‌ళ్లీ పున‌ర్ వైభ‌వం వ‌చ్చింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం అంచుల వ‌ర‌కు ఈ పార్టీ చేరుతుంద‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. బీజేపీ నేత‌లు అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. స‌రైన నేత‌లు లేక‌పోవ‌డంతో కొంత డౌట్‌గానే ఉంది. ఈ నేప‌థ్యంలో కుమార స్వామి యువ‌త‌కు ప్రాధాన్యం పెంచారు, ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు గుప్పిస్తున్నారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని ఆయ‌న పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

గ‌త కొన్నాళ్లుగా సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లోనూ అసంతృప్తి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అంబ‌రీష్ జేడీఎస్ త‌లుపు త‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, కాంగ్రెస్‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తున్న జేడీఎస్ వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు త‌న పంచ‌న చేర్చుకునేందుకు రెడీ అయింది. దీంతో అంబ‌రీష్‌.. రాక‌ను కుమార స్వామి స్వాగ‌తిస్తున్నార‌ని, ప‌ద‌వుల విష‌యంలోనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని తాజా స‌మాచారం. ఇది ఒక‌టి లేదా రెండు రోజుల్లో ఖ‌రారు అవుతుంద‌ని దీంతో అంబ‌రీష్ త‌న భార్య మాజీ హీరోయిన్ సుమ‌ల‌త‌తో క‌లిసి దేవెగౌడ చెంత‌కు చేర‌తార‌ని తెలుస్తోంది.

అంబ‌రీష్ ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోకి మండ్య జిల్లా కేంద్రం నుంచి అసెంబ్లీకి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ మారినా జేడీఎస్ నుంచి అక్క‌డ నుంచి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక హీరోయిన్ ర‌మ్య ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కురాలిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌మ్య‌కు అంబ‌రీష్‌కు రాజ‌కీయంగా వార్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో అంబ‌రీష్‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డంతో ఆయ‌న తీవ్ర అవ‌మానంగా భావించి, ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నార‌ని తెలుస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.


ఢిల్లీ వేదికగా మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు....!

Posted 4 hours ago | Category : politics

ఢిల్లీ వేదికగా మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు....!

అవిశ్వాసం పై పురందేశ్వరి కౌంటర్....!

Posted 5 hours ago | Category : politics

అవిశ్వాసం పై పురందేశ్వరి కౌంటర్....!

నేను మిస్సయ్యానే.. అవిశ్వాసంపై కేటీఆర్ ట్వీట్..!

Posted 7 hours ago | Category : politics

నేను  మిస్సయ్యానే.. అవిశ్వాసంపై కేటీఆర్ ట్వీట్..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.....!

Posted 8 hours ago | Category : politics

ఢిల్లీ  వెళ్లిన  ఏపీ  సీఎం.....!

మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగిన టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్...!

Posted 9 hours ago | Category : politics

మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగిన టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్...!

పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకి... గుడ్ బై చెప్పినట్లేనా....

Posted 9 hours ago | Category : politics

పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకి... గుడ్ బై చెప్పినట్లేనా....

ఫలించిన చంద్రబాబు వ్యూహం......ఆత్మ రక్షణలో వైసీపీ...!

Posted a day ago | Category : politics

ఫలించిన చంద్రబాబు వ్యూహం......ఆత్మ రక్షణలో వైసీపీ...!

పవనే సీఎం అంటున్న...శ్రీరెడ్డి..

Posted a day ago | Category : movies politics

పవనే సీఎం అంటున్న...శ్రీరెడ్డి..

పార్లమెంట్ లో ఊహించని పరిణామం...... రాహుల్ చేసిన పనికి షాక్‌కు గురైన మోదీ...!

Posted a day ago | Category : politics

పార్లమెంట్ లో ఊహించని పరిణామం...... రాహుల్ చేసిన పనికి షాక్‌కు గురైన మోదీ...!

గల్లా దెబ్బ కి దద్దరిల్లిన పార్లమెంట్... గల్లా స్పీచ్‌ హైలైట్స్.....!

Posted a day ago | Category : politics

గల్లా దెబ్బ కి దద్దరిల్లిన పార్లమెంట్... గల్లా స్పీచ్‌ హైలైట్స్.....!

భరత్ అనే నేను సినిమా కథతో మొదలైన గల్లా జయదేవ్ ప్రసంగం...!

Posted a day ago | Category : politics

 భరత్ అనే నేను సినిమా కథతో మొదలైన గల్లా జయదేవ్ ప్రసంగం...!