//single page style gallary page

మాందసౌర్‌ వెడుతున్న రాహుల్ ను అడ్డుకున్న పోలీస్

Posted a year ago | Category : national politics

రైతుల ఆందోళనతో అట్టుడికిపోతున్న మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌ ప్రాంతంలో పర్యటించేందుకు  మోటార్ బైక్ పై వెడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ లు అనుమతించక పోయినా ఆందోళన చేస్తున్న రైతులను కలవడం కోసం బయలు దేరిన అయన  కాన్వాయ్‌ను మాందసౌర్‌కి సమీపంలోనే పోలీసులు నిలిపివేశారు.

 ఉదయ్‌పూర్‌ వద్ద కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రదేశమంతా పోలీసులు ఉండటంతో రాహుల్‌ వెంటనే మోటార్ బైక్ పై మాందసౌర్‌ వెళ్లేందుకు బయలుదేరారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు, విలేకర్లు, పోలీసులు కొద్ది దూరం పాటు రాహుల్‌ బైక్‌ వెనుక వెళ్లారు. ‘రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ పోలీసులు నన్ను మాందసౌర్‌ వెళ్లనీయకుండా చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 

నీముచ్‌ వద్ద రాహుల్‌గాంధీని మళ్లీ అడ్డుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ మరి కొందరు కాంగ్రెస్ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని సమీపంలో ఉన్న ఒక సిమెంట్ కంపెనీ అతిధి గృహానికి తరలించారు. 

రుణమాఫీ అడుగుతున్న రైతులు బుల్లెట్లు పొందుతున్నరని అంటూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విమర్శించారు. ఆందోళనలు జరిగే ప్రాంతంలో పర్యటించేందుకు అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. మాందసౌర్‌ సరిహద్దులో దాదాపు 700 మంది భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి.

వైసీపీ కి గ్రీన్ సిగ్నల్ మాజీ మంత్రి డీఎల్..

Posted an hour ago | Category : politics

వైసీపీ కి గ్రీన్ సిగ్నల్  మాజీ మంత్రి డీఎల్..

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 19 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 20 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 20 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted a day ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

Posted 2 days ago | Category : national state

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

Posted 2 days ago | Category : national state

 కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

బాబాయ్‌ వల్లే మాకు గొడవలు: సుస్మిత

Posted 2 days ago | Category : movies national

బాబాయ్‌ వల్లే  మాకు గొడవలు:  సుస్మిత