ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పర్యాటక రంగానికి ప్రాణనాడిగా పోలవరం

Posted 6 months ago state politics

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగానే కాకుండా పర్యాటక రంగానికి ప్రాణనాడిగా మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు, పరిసర ప్రాంతాల్లో వున్న పట్టిసీమ, ధవళేశ్వరం, పాపికొండలు, చిన్నచిన్న దీవులు ఆకర్షణగా నిలుస్తాయని, వీటిని పర్యాటకులు వీక్షించేలా సౌకర్యాలు కల్పించి, అభివృద్ధి పరచాలని సూచించారు. ముందుగా అతిధిగృహాల నిర్మాణం చేపట్టాలని చెప్పారు.

అలాగే పోలవరం ప్రాజెక్టులో భాగంగా స్పిల్ చానల్‌పై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి ఆకట్టుకునే విధంగా ఆకృతులు రూపొందించాలని స్పష్టం చేశారు. పోలవరం పునాదుల నుంచి ప్రాజెక్టు పూర్తయ్యేవరకు సంబంధించిన అన్ని దశలు కళ్లకు కట్టేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు అక్కడ పర్యాటకరంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపైనా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.

పోలవరం సహా రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా రాత్రి పూటనే కాంక్రీట్ పనులు చేస్తున్నామని, వర్షం కారణంగా రెండ్రోజుల పాటు స్పిల్ చానల్ నీటితో నిండిపోయి పనులకు అంతరాయం కలిగిందని సీఈ రమేష్ ముఖ్యమంత్రికి వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌లో వివరించారు.

పోలవరం ప్రాజెక్టు కోసం మొత్తం 1,055 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి వుండగా 703 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఇంకా 352 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు మిగిలాయి. ఇప్పటివరకు 66.64% తవ్వకం పనులు పూర్తయ్యాయి. కాఫర్ డ్యాం కటాఫ్ వాల్, స్పిల్ చానల్ బ్రిడ్జి పనులు వచ్చే నెల 8న మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. జూన్ 30 నుంచి కాంక్రీట్ పనులు వేగవంతం చేయాలని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణం గురించి జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాగావళి, వంశధారతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని నదుల అనుసంధానం త్వరతిగతిన పూర్తిచేయాలని సూచించారు. పోతిరెడ్డిపాడు పనులు ఆలస్యం కావడానికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Most Read