//single page style gallary page

నిరుద్యోగం, డొక్కలం, గోర‌ఖ్‌పూర్‌ లపై ప్రధాని మౌనం

Posted a year ago | Category : politics

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిరుద్యోగం, డొక్కలం,  గోర‌ఖ్‌పూర్‌ వంటి పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బెంగుళూరు లో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ కాంగ్రెస్ వ‌త్తిడి వ‌ల్లే మ‌హారాష్ట్ర‌, యూపీ రాష్ట్రాల్లో రైతుల రుణాలు మాఫీ జరిగినదని చెప్పుకొచ్చారు. 

ప్ర‌ధాని ద‌గ్గ‌ర చెప్పుకోవ‌డానికి ఏమీ లేద‌ని, అందుకే మోదీ త‌న ప్ర‌సంగ స‌మ‌యాన్ని త‌గ్గించార‌ని రాహుల్ ఆరోపించారు.  దేశంలో నిరుద్యోగ శాతం గ‌త 8 ఏళ్ల‌లో అత్య‌ధికంగా ఉంద‌ని, ఆ విష‌యాన్ని మోదీ త‌న ప్ర‌సంగంలో చెప్ప‌లేద‌ని గుర్తు చేశారు.  ప్ర‌తి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న ప్రధాని ఆ అంశాన్ని ప్ర‌స్తావించ‌డం లేదని చెప్పారు. 

 బీజేపీ తీసుకున్న ఆరోగ్య‌ విధానాల వ‌ల్లే గోర‌ఖ్‌పూర్‌లో 90 మంది చిన్నారులు చ‌నిపోయార‌న్న విష‌యాన్ని మోదీ త‌న ప్ర‌సంగంలో వెల్ల‌డించ‌లేద‌ని రాహుల్ విమ‌ర్శించారు. హెల్త్ బ‌డ్జెట్‌ను మోదీ ప్ర‌భుత్వం త‌గ్గించడం వల్లననే పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఆక్సిజ‌న్‌ను హాస్ప‌ట‌ల్ కొన‌లేపోయిందని ఆరోపించారు. 

అప్పుడెప్పుడో చైనా అధ్య‌క్షుడు భార‌త్‌కు వ‌చ్చార‌ని, అప్పుడు అత‌న్ని మోదీ హ‌గ్ చేసుకున్నార‌ని, అదే స‌మ‌యంలో వేలాది మంది చైనా సైనికులు మ‌న దేశంలోకి చొర‌బ‌డ్డార‌ని ప్ర‌ధానిపై సెటైర్ వేశారు రాహుల్‌. భూటాన్‌లోనే చైనా ద‌ళాలు ఉన్నాయ‌న్న అంశాన్ని మోదీ త‌న ప్ర‌సంగంలో చెప్పిన విష‌యాన్ని ఎవ‌రైనా గ‌మ‌నించారా అని ప్ర‌శ్నించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో శాంతి స్థాప‌న కోసం ప‌దేళ్లు త‌మ ప్ర‌భుత్వ క‌ష్ట‌ప‌డిది మోదీ ప్ర‌భుత్వం ఒక్క నెల‌లోనే దాన్ని నాశ‌నం చేసింద‌ని ఆవేదన వ్యక్తం చేసారు.

విదేశాంగ విధానంలో మోడీ ఘోరంగా విఫలం అయ్యరని అంటూ మొట్ట‌మొద‌టి సారి పాకిస్థాన్‌కు ర‌ష్యా ఆయుధాలు అమ్ముతున్న‌ద‌ని తెలిపారు.  మోదీ ప్ర‌భుత్వం స్నేహ‌పూర్వ‌క దేశాల‌తో అనేక స‌మ‌స్య‌ల‌ను తీసుకువ‌చ్చింద‌ని చెబుతూ పాకిస్థాన్‌, చైనా త‌ప్ప మ‌న‌చుట్టు ఉన్న అన్ని దేశాలు మ‌న‌తో స్నేహంగా ఉండేవ‌ని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింద‌ని చెప్పారు. నేపాల్ మ‌న‌కు దూర‌మైంద‌ని, శ్రీలంక‌లో చైనా పోర్ట్ నిర్మిస్తున్న‌ద‌ని రాహుల్ తెలిపారు.

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 15 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 17 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 18 hours ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted 18 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted 18 hours ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted 20 hours ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted 20 hours ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted 21 hours ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted 21 hours ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted a day ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్