//single page style gallary page

పిలిప్పీన్స్ బ్యాంక్ ఖాతాల నుంచి డ‌బ్బులు మాయం

Posted a year ago | Category : world business

పిలిప్పీన్స్ బ్యాంక్‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఆ దేశానికి చెందిన బీపీఐ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో సొమ్ము విత్‌డ్రా అయ్యింది. ఖాతాదారుల ప్ర‌మేయం లేకుండానే డ‌బ్బు విత్‌డ్రా అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆన్‌లైన్ అకౌంట్లు ఉన్న ఖాతాదారులు త‌మ అకౌంట్ల‌ను వాడ‌లేని ప‌రిస్థితి త‌లెత్తింది. బీపీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న క‌స్ట‌మ‌ర్లు త‌మ డ‌బ్బు పోయిందంటూ ల‌బోదిబోమంటున్నారు. దీంతో ఆ దేశ సోష‌ల్ మీడియాలో బ్యాంక్ లావాదేవీల‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇంట‌ర్న‌ల్ డేటా ప్రాసెసింగ్ లోపం వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మైన‌ట్లు అధికారులు పేర్కొంటున్నారు. అకౌంట్ బ్యాలెన్స్ కూడా త‌ప్పుగా చూపిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. త‌మ ఖాతాల నుంచి సొమ్ము పోయిందంటూ కొంద‌రు క‌స్ట‌మ‌ర్లు బ్యాంకుల‌ ముందు బారులు తీరారు. కొన్ని అకౌంట్ల‌లో రెండు మూడు సార్లు డ‌బ్బు డెబిట్‌, క్రెడిట్ అయిన‌ట్లు చూపిస్తున్నాయి. బీపీఐ బ్యాంక్‌ను హ్యాక‌ర్లు టార్గెట్ చేసి ఉంటార‌ని కూడా అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే ఇది హ్యాకింగ్ కాదు అని, అంత‌ర్గ‌త స‌మ‌స్య వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. ప‌ద‌ల సంఖ్య నుంచి ల‌క్ష‌ల పీసోలు(పిలిప్పీన్స్ క‌రెన్సీ) త‌మ ఖాతా నుంచి మాయ‌మైన‌ట్లు క‌స్ట‌మ‌ర్లు ఆరోపిస్తున్నారు.ఫలితంగా మనీలా స్టాక్‌ మార్కెట్లలో బీపీఐ షేరు ఒక శాతం కుంగింది.

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

Posted 8 days ago | Category : business

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

Posted 9 days ago | Category : business

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Posted 20 days ago | Category : business

భారీ నష్టాల్లో ముగిసిన  స్టాక్‌మార్కెట్లు

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 23 days ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 24 days ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted a month ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

Posted a month ago | Category : business

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted a month ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted a month ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!