త్వరలో అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ పాదయాత్ర

Posted 9 months ago | Category : state politics

ఎన్ని సమస్యలు ఎదురైనా అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా నుంచి 150 మందికి పైగా ప్రతినిధులతో ఆయన తన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసేన పార్టీ కోసం స్పీకర్లు, కంటెంట్‌ రైటర్లు, అనలిస్టులుగా సేవలందించేందుకు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నూతన నాయకులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఆ ప్రతినిధులంతా తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. అనంతరం పవన్ వారితో మాట్లాడుతూ తుది శ్వాస వరకూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తనను కొందరు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని కాదని విమర్శిస్తున్నారనీ, అసలు పూర్తిస్థాయి రాజకీయ నాయకులు ఎవరున్నారో చెప్పాలని అన్నారు. ఒక్కో నాయకుడు రూ.వేల కోట్ల ఆదాయాన్ని రాజకీయాల్లో ఆర్జించి ఇంట్లో కూర్చున్నారని, వారు ఇంట్లో కూర్చొని కోట్లాది ఆదాయం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారని విమర్శించారు. అయితే, తాను మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన తన సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నానన్నారు. తనకు సినిమాలన్నా, సినీ పరిశ్రమ అన్నా అపారమైన గౌరవం ఉందని చెప్పారు. అయితే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేసుకుంటానని పేర్కొన్నారు.ఇటీవల అనంతపురంలో మూడు రోజులపాటు జరిగిన జనసేన శిబిరంలో పాల్గొన్న వారందరినీ కలవడానికి కొద్ది రోజుల్లో జిల్లాకు వస్తానని చెప్పారు. త్వరలోనే జిల్లాలో పాదయాత్ర చేస్తానని చెప్పడంతో ప్రతినిధులంతా హర్షధ్వానాలతో ఆనందం వ్యక్తంచేశారు.


వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

Posted 4 hours ago | Category : state

వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

Posted 6 hours ago | Category : state

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

Posted 10 hours ago | Category : state

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

Posted 11 hours ago | Category : state

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

Posted 14 hours ago | Category : state

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 15 hours ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 16 hours ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted a day ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!