మంత్రి అఖిల ప్రియ పై పవన్ పంచులు.

Posted a month ago | Category : politics

ఒంగోలు పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారితో మాట్లాడి, ఆవేదనను తీర్చే ప్రయత్నం చేశారు. మీ ఇంట్లోనే ఎవరినైనా కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి. ఇలాంటి క్షోభ మరే కుటుంబానికి రాకుండా చేయాలంటే ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. ఓటు అనే బోటు మీద మీరు తీరం దాటారు. ఆ విషయం మర్చిపోవద్దు. అఖిల ప్రియ.. మీరు అతి కొద్దికాలంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి సాటివాళ్ల బాధను వెంటనే అర్థం చేసుకోగలరు.

శోభ నాగిరెడ్డి దంపతులు నాకు పీఆర్పీ నుంచి తెలుసు. మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీ నాన్న నాకు ప్రత్యర్థి కావాలి. నేను వస్తే ఓడిపోతానంటే.. మీరు అమ్మను కోల్పోయారనే కారణంతో ఎన్డీయేకి మద్దతు ఇచ్చినప్పటికీ నేను నంద్యాలలో ప్రచారం చేయలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. పరోక్షంగా రెండుసార్లు మీ విజయానికి తోడ్పడ్డా అని పవన్ మంత్రి అఖిల ప్రియని ఉద్దేశించి మాట్లాడారు.

అఖిల ప్రియను తప్పుబట్టడం లేదంటూనే లాల్ బహదూర్ శాస్త్రి ఉదంతాన్ని జనసేనాని ప్రస్తావించారు. లాల్ బహుదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే.. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. అఖిల ప్రియ అలా చేయనక్కర్లేదు. కానీ ఇక్కడికి రావాలి. మీ తప్పేం లేదు. కానీ మంత్రిగా బాధ్యత వహించి.. బాధితులతో మాట్లాడాలి. ప్రజాసమస్యల పట్ల స్పందించకపోతే.. మీది బాధ్యత రాహిత్యం అవుతుంది. మీ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల చెబుతున్నా. వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడండి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. ఏం చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు రూపొందించండని సూచించారు.


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ