ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

జనసేనలో రెండో విడుత షెడ్యూల్ విడుదల.

Posted 5 months ago politics

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన తన పార్టీ కార్యకర్తల ఎంపికను వేగవంతంగా ముందుకు తీసుకుపోతోంది. రాయలసీమలో భాగంగా అనంతపురంలో విజయవంతంగా పూర్తయిన ఈ ప్రతిభ పాటవ ఎంపిక శిబిరాలు రెండోవిడత ప్రారంభం కానున్నాయి. జనసేన ఔత్సాహికుల వేదిక రాయలసీమ జిల్లాల్లో మలివిడత రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ విడతలో కర్నూలు - కడప చిత్తూరు జిల్లాల్లో మొదలు కాబోతున్నాయి.

ఇప్పటికే ఈ మూడు జిల్లాల నుంచి సుమారు 5500 దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా పార్టీ కార్యాలయానికి అందాయని జనసేన వర్గాలు తెలిపాయి. యువతి యువకులు - మేధావులను క్రియాశీలక రాజకీయాలలో భాగస్వాములను చేసి తద్వారా ఒక బలమయిన పౌర సమాజం నిర్మించాలన్న మహోన్నత ఆశయంతో తలపెట్టిన ఈ మహత్కార్యానికి చేయూతనిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని జనసేన పత్రికా ప్రకటన తెలిపింది. తాజాగా చేపట్టే రెండో విడత ఎంపికలో ఒక్కో జిల్లాలో రెండు రోజులపాటు ఈ వేదిక కొనసాగుతుంది. ఈ నెల 29 - 30 తేదీలలో కర్నూలు లో - ఈ నెల 30.జూలై 1 న కడప - జూలై 2 - 3 న చిత్తూరులోను ఈ శిబిరాలు జరుగుతాయి. ఈ మూడు జిల్లాల వారు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపే గడువు ఈ రోజు అంటే మంగళవారం రాత్రితో ముగుస్తుంది. ఆన్ లైన్లో దరఖాస్తులు పంపించలేకపోయినవారు వేదిక ప్రాంగణంలో తమ పేర్లు - వివరాలు నమోదు చేసుకుని ఈ శిబిరంలో పాల్గొనవచ్చు. మిగిలిన వివరాలను ఎస్.ఎం.ఎస్. ఈ-మెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియచేస్తారని వివరించారు. ఈ సమాచారాన్ని మరోసారి తెలుసుకోడానికి జనసేన ఫేస్ బుక్ పేజీని చూడాలని కోరింది.

ఎంపిక శిబిరాల ఇవి...

-కర్నూలు (ఈ నెల 29 - 30) దేవి ప్యారడైజ్ ఫంకన్ హాల్ - ఎస్.ఎల్.ఎం.టి.వి.ఎస్. ఏ రూము ఎదురుగా - నంద్యాల చెక్ పోస్ట్ వద్ద - కర్నూల్

- కడప (ఈ నెల 30 - జూలై 1) వై.ఎస్.ఆర్. ఆడిటోరియం మద్రాస్ రోడ్ - మున్సిపల్ హై స్కూల్ పక్కన - కడప

-చిత్తూరు (జూలై 2 - 3) కీస్ హోటల్ విహాస్ - 18-8-40/ బీ - లీల మహల్ సెంటర్ - తిరుపతి

Related Articles

Most Read