ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుండే !

Posted 5 months ago politics

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమయింది. ఆగస్టు 11 నాటికి ముగిసే ఈ సమావేశాలకు ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. దేశమెదుర్కొంటున్న అనేక సవాళ్లను పార్లమెంట్‌ సమావేశాల్లో లెవనెత్తేందుకు ప్రతిపక్షాలు అస్త్ర, శస్త్రాలతో సిద్ధమయ్యాయి.

సమావేశాల నిర్వహణపై ఆదివారం నాడు పార్లమెంట్‌ లైబ్రరీ హాల్‌లో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వేర్వేరుగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, అనంతకుమార్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ హాజరయ్యారు. తృణముల్‌ కాంగ్రెస్‌, జెడియులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై వాడివేడిగా చర్చ జరిగింది. 

ఈ సమావేశంలో జీఎస్టీ, రైతు ఆత్మహత్యలు, గోరక్షక్‌ దాడులు, అమర్‌నాథ్‌ యాత్రికులకుపై ఉగ్రదాడి, కాశ్మీర్‌, భారత్‌, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. చైనా ఘటనపై ప్రభుత్వ వైఖరి తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.  ఈ సమావేశాల్లో 16 బిల్లులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యసభలో 10, లోక్‌సభలో 8 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

24 ఉత్తర పరగణాల జిల్లాలో మత ఘర్షణలకు బిజెపి కారణమని ఆరోపిస్తున్న తణమూల్‌ కాంగ్రెస్‌ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి దూరంగా ఉంది. అయితే, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నిర్వహించే అఖిలపక్ష భేటీకి హాజరైంది. 

పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించేందుకు ప్రతిపక్షాల అనేక అంశాలను లెవనెత్తాయని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ చెప్పారు. మహిళలపై పెరిగిన దాడులు, చేనేత కార్మికుల సమ్మె, అస్సాంలో వరదలు, డార్జిలింగ్‌ హింస, కాశ్మీర్‌ రక్షణ, రైతుల పరిస్థితి, గో సంరక్షణ దాడులు, చైనా అంశం తదితర అంశాలను లెవనెత్తామని వివరించారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 14 రోజులు మాత్రమే నిర్వహించడం సరికాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అసంతృప్తి వ్యక్తం చేశారు.  మహిళా రిజర్వేషన్‌ బిల్లు, పంటలకు కనీస మద్దతు ధర, ఆధార్‌ డేటాకు రక్షణ వంటి అంశాలకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రస్తుతం తమకు ఇచ్చిన జాబితాలో లేదన్నారు. 

Related Articles

Most Read